16 Jul 2025
స్వామి వాక్యమే సత్యము.
ఒక భక్త దంపతులు విజయవాడలో వేడుకొనగా స్వామి "ఆవీరో జాయతాం పుత్రః" అని ఆశీర్వదించినారు. ఇది వేదములోని వాక్యము. దీని అర్థము "మీకు మంచి మొనగాడైన పుత్రుడు జన్మించుగాక" అని. తరువాత ఆ భక్తురాలు గర్భవతి అయినది. 8వ నెలలో స్కానింగ్ తీయగా ఆడ శిశువు అని వచ్చినది. ఆ భక్తురాలి తండ్రి స్వామితో ఈ విషయం చెప్పినాడు. స్వామి “నేను ఆశీర్వదించినది వేద మంత్రము. అది పొల్లుపోదు - పుత్రుడే జన్మించును” అని అన్నారు. దానికి ఆయన నవ్వుతూ “మంత్రాలకు సెక్స్ (లింగము) మారునా?” అని ఎగతాళి చేసినారు. 9వ నెలలో ఆ భక్తురాలు పండంటి పుత్రుని కన్నది!
గుంటూరులో మరియొక భక్తురాలు గర్భవతిగా ఉన్నప్పుడు స్కానింగులో ఆడశిశువు అని తేలినది. స్వామి “నిజమే నీ గర్భములో ఉన్నది ఆడశివువే, కానీ దైవశక్తికి అసాధ్యము కలదా? నీ గర్భమున నున్న ఈ ఆడశివువును ఈ క్షణములో మగశిశువుగా మార్చుచున్నాను” అనెను. అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు స్వామితో పందెము కాసిరి. ఆ భక్తురాలికి మగ శిశువు జన్మించెను. ఆ శిశువు ఆడపిల్లవలె సుందరముగ కోమలముగ నుండెను!
★ ★ ★ ★ ★