17 Jul 2025
శివుడు ఆదిత్య రూపుడు.
శ్రీశైలంలో ఉదయం ఎప్పుడూ శివునిమీద భజన క్యాసెట్లు వేస్తారు. అందులోను మొట్టమొదటి క్యాసెట్టు ఎప్పుడూ శివపరంగానే ఉంటుంది. ఒకరోజు స్వామి తెల్లవారుఝామున లేచి మాతో “ఈ రోజు శివుడు ఆదిత్యస్వరూపంతో ఉన్నాడు. “అసౌ యస్తామ్రో అరుణః” అని శ్రుతి గదా” అన్నారు. ఈ మాట చెప్పగానే శివాలయం నుండి మొదటి క్యాసెట్టు పాటలో ఆదిత్యహృదయము వినిపించింది. మేము శివాలయమునకు పోయి మొదటి పాట ఆదిత్యహృదయము ఎందుకువేసారని విచారించగా, ఆరోజు క్యాసెట్లు వేయు ఉద్యోగి సెలవు పెట్టినందున ఎవరో కొత్తవాడు (ఉద్యోగిచే పంపబడినవాడు) వచ్చి తెలియక ఆ క్యాసెట్టును వేసినాడట. ఆహా! ఎంతటి మహిమ!
★ ★ ★ ★ ★