home
Shri Datta Swami

 30 Jun 2025

 

విష్ణులహరి - 10

సీతమ్మ గారి తలనొప్పి తగ్గించుట.

భక్తురాలు సీతమ్మగారు చాలా కాలమునుండి శిరోవేదనతో బాధపడుచుండెను. స్వామిని చూచుటకు మొదటి సారిగా ఆవిడ మా ఇంటికి వచ్చినది. అప్పుడు స్వామి శయనించియున్నారు. అపుడు సీతమ్మగారికి ఒక అద్భుత దర్శనమైనది. పైనుండి బంగారుకాంతి రింగులు గిరగిర తిరుగుచు వచ్చి స్వామి శిరస్సులో లీనమగుచున్నాయి. స్వామి సీతమ్మగారి వైపు చూచి చిరునవ్వు చిందించారు, అంతే! సీతమ్మగారి తలనొప్పి శాశ్వతముగా అదృశ్యమైనది. కానీ తరువాత 3 రోజులు స్వామి విపరీతమగు శిరోవేదనతో బాధపడ్డారు. ఆహా! ఇది ఆవిడకు స్వామి అనుగ్రహమే కదా!

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch