01 Jul 2025
శస్త్రచికిత్స నొప్పులను తగ్గించుట.
శ్రీమతి వసుమతిగారికి శస్త్రచికిత్స జరిగినది. ఆవిడ ఆసుపత్రిలో విపరీతములగు నొప్పులతో బాధపడుచున్నది. రాత్రి 9 గం॥కు ఆమె భర్తయగు శ్రీ భీమశంకరంగారు మనస్సులో తన భార్య నొప్పులు తలచుకుంటూ స్వామికి నమస్కరించినారు. స్వామి నవ్వి ప్రసాదమును భీమశంకరంగారి చేతిలో నుంచి “ఇది వసుమతికి ఇమ్ము”! అని ఆదేశించినారు. సరిగా సమయం 9.00 గం. అయినది. అదే సమయంలో వసుమతి గారికి ఆసుపత్రిలో ఒక విద్యుచ్ఛక్తి షాక్ కొట్టినట్లు అనుభూతి కలిగినది. అంతే! నొప్పులన్నీ మాయమైనవి!
★ ★ ★ ★ ★