03 Jul 2025
భక్తుని రక్తపోటును స్వీకరించుట.
శ్రీ కోనేరు సత్యనారాయణగారు కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజీ ఛైర్మన్. వారికి స్వామియందు శ్రద్ధాభక్తులు కలవు. సత్యనారాయణగారు సత్యము, ధర్మము మూర్తీభవించిన అత్యుత్తమసాధకుడని మాతో ఎప్పుడూ స్వామి చెప్పేవారు. ఒకరోజు ఆయన సోఫాలో స్వామిని తన ప్రక్కన కూర్చుండబెట్టుకొని తన రక్తపోటును పరీక్షా సాధనములో చూచుకొనుచున్నారు. అప్పటికి 15 రోజుల నుండి ఎన్నో వైద్యములు చేయించుకున్నా రక్తపోటు తగ్గలేదు. తన అనారోగ్యమును గురించి స్వామితో ముచ్చటించారు ఆయన. స్వామి చిరునవ్వు చిందించారు. "ఇప్పుడు ఎంత ఉందో?" అన్నారు స్వామి. వెంటనే ఆయన పరీక్షలో ఆశ్చర్యము! రక్తపోటు తగ్గినట్లు పరీక్షా సాధనము చూపించింది. ఆయన దానికి విస్మితులైనారు. ఆనాటి రాత్రి స్వామి మా ఇంటిలో శయనించారే కాని తెల్లవార్లూ రక్తపోటుతో బాధపడినారు. భక్తుల అనారోగ్యమును తాను స్వీకరించి, అనుభవించి భక్తులకు సుఖమును అందించటం శ్రీదత్తుని వాత్సల్యలక్షణము కదా!
★ ★ ★ ★ ★