07 Jul 2025
బాలికను కాపాడుట.
[శ్రీరామనాథ అయ్యర్, వారి ధర్మపత్ని, పుత్రిక]
శ్రీ రామనాథ అయ్యర్ గారు బొంబాయిలో యుటిఐ బ్యాంక్ లో వైస్ప్రెసిడెంటుగా పని చేయుచున్నారు. ఒకసారి శ్రీ రామనాథ అయ్యర్ గారు స్వామిని దర్శించుట జరిగినది. ఇంతలో ఆయన కుమార్తెకు పెద్ద జబ్బు చేసినది. ఆ బాలికను ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చటం కూడా జరిగినది. శ్రీ అయ్యర్, స్వామి ఫొటోకు ఎదురుగా ఆసీనుడై స్వామిని “స్వామీ! మీరే కాపాడాలి” అని ప్రార్థించారు. ఆ సమయమందు స్వామి విజయవాడలో ఉన్నారు. భక్తులతో ముచ్చటిస్తున్న స్వామి నవ్వుతూ “నుదుటి వ్రాతలను తుడిచివేయగా, వ్రాసిన వారే సర్వ సమర్థులు” అని పాడారు. అంతే! అక్కడ బాలికకు జబ్బు అంతయు అదృశ్యమై మృత్యువాత నుండి ఆడుతూ పాడుతూ బయటకు వచ్చినది! కృతఙ్ఞత చెప్పుకుంటూ అయ్యర్ స్వామికి ఫోన్ చేసారు. స్వామి అదే పాటను అయ్యర్ గారికి ఫోన్లో వినిపించారు. అందరూ సంతోషించారు. ఈ చరణమే స్వామి రచించిన బ్రహ్మ గాయత్రి భజనలో ఉన్నది.
అయితే అయ్యర్ తన చెల్లెలుకు బాగా జబ్బు చేయగా ఆసుపత్రిలో చేర్చి స్వామిని రక్షించమని ఫోన్ చేసినారు. అపుడు, స్వామి “లాభం లేదు. ఆమె చెవిలో శ్రీరామనామమును చెప్పుము” అని పలికారు. ఆమె మరునాడే పరమపదమును చెందినది. ఆహా! అంతా దైవనిర్ణయమే కదా!
★ ★ ★ ★ ★