10 Jul 2025
నారదముని గానము-చికిత్స.
[శ్రీ ఆంజనేయశర్మ, శ్రీమతి కామేశ్వరమ్మ]
శ్రీమతి కామేశ్వరమ్మ గారు, తన భర్త శ్రీ ఆంజనేయశర్మ గారితో సహావచ్చి స్వామి శరణమును కోరినది. ఆ శర్మగారు వాక్కు మందగించి, పక్షవాతమునకు గురియైనారు. స్వామి శర్మగారితో “స్వామి పాటలు పాడేటంత మాత్రము నీకు స్వామి వాక్కుననుగ్రహించును” అన్నారు. దానితో శర్మగారు “నాదతను మనిశం శంకరం” అను కీర్తన నందుకున్నారు. స్వామి అదే కీర్తనను అందుకొని మధురంగా గానం చేశారు. వెనుక త్యాగరాజు పాడుతుంటే, శ్రీ నారదముని ఈ పాటను అందుకొన్నారు గదా. స్వామి నారదునిగా తన గానంతో అనుభూతిని ఇచ్చారు నాకు, అచటనున్న శర్మగారికి. శర్మగారు ఎంతో ఉద్వేగంతో స్వామి పాదాలపైబడి శరణము వేడినారు. స్వామి ఇట్లు చెప్పినారు “నీ కర్మ ముగియనున్నది. ద్వారకలో కృష్ణాలయంలో ఒక పావురము కంఠానికి రాయి వేసి కొట్టిన ఫలం ఇది. వచ్చే జన్మలో మంచి భక్తుడవై స్వామిగానం చేస్తావు” అని ఆశీర్వదించినారు.
ఆంజనేయశర్మ గారి ఆనందమునకు అవధులు లేవు. వారి సతీమణి కామేశ్వరమ్మ గారిని గురించి చెప్పనవసరమే లేదు. ఆమె స్వామి భక్తురాలైనది. ప్రతిరోజు సత్సంగములో పాల్గొని తరించుచున్నది.
★ ★ ★ ★ ★