home
Shri Datta Swami

Posted on: 07 Nov 2020

               

English »   English »   Malayalam »  

దత్తస్వామి- త్రిసూత్ర - మతము

జ్ఞానులైన మరియు భక్తులైన భగవత్ సేవకులారా

[అక్టోబర్ 27 2020న ఆన్‌లైన్ ఆధ్యాత్మిక చర్చ జరిగింది, ఇందులో పలువురు భక్తులు పాల్గొన్నారు. స్వామి సమాధానమిచ్చే భక్తుల ప్రశ్నలలో కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి.]

శ్రీ దుర్గాప్రసాద్ అడిగిన ప్రశ్న: స్వామి! మీరు బోధించిన జ్ఞానాన్ని ఒక్క పదములో ఏ విధముగా వ్యక్తపరచగలము?

స్వామి సమాధానము:-  ఈ మొత్తం జ్ఞానాన్ని మూడు పదాలలో చెప్పవచ్చు:-

1) దత్త-పరబ్రహ్మ- మతము.

ఇది మూడు పదముల యొక్క మిశ్రమ పదము. ఈ మూడు పదములు ఏమనగా:- దత్త (ఉపాధిని కలిగిన ఊహాతీత భగవంతుడు) - పరబ్రహ్మము (మొట్టమొదటి  ఊహాతీత భగవంతుడు) - మతము (తత్త్వజ్ఞానము).

{వివరణ:- దత్త అనగా పరబ్రహ్మము సంపూర్ణంగా విలీనము అయిన మొదటి తేజోమయ అవతారము. దత్తుడికి మరియు అనూహ్య పరబ్రహ్మమునకు మధ్య ఎటువంటి భేదము లేదు. దత్త అనగా పరబ్రహ్మము తనను తాను ఒక తేజోమయ రూపములో ప్రకటించుకున్నవాడని, పరబ్రహ్మము (ఊహాతీత భగవంతుడు) ఎటువంటి ఉపాధి లేనివాడు అని అర్థము. ఊహాతీత పరబ్రహ్మము సృష్టికి అతీతుడు, కావున ఆయన మన మనస్సుకు, బుద్ధికి, తర్కానికి అందడు. ఊహాతీత పరబ్రహ్మమే పరిపూర్ణ సత్యము. తేజోమయ రూపాలకు తేజోమయ ఉపాధిలోను  మానవులకు మానవ ఉపాధిలోను ప్రకటించబడతాడు, ఏ ఉపాధియైనా సాపేక్ష సత్యమే. పరిపూర్ణ సత్యము (Absolute truth), సాపేక్ష సత్యమైన (relative truth) సృష్టిలో మహిమలు చేయగలడు.  తేజోమయమైన అవతారము ఊర్ధ్వలోకాలకు సంబంధించివి మరియు నరావతారము భూలోకానికి సంబంధించినది. దత్త అనగా మొదటి తేజోమయ అవతారము. దత్త అనగా అన్ని తేజోమయ అవతారాలు మరియు అన్ని నరావతారములు. దత్త అనగా ‘దొరికినది లేదా చిక్కినది’ అని అర్ధం, అనగా ఊహాతీతమైన మరియు కనిపించని భగవంతుడు, కనిపించబడే మరియు ఊహించదగిన ఉపాధిలో ప్రపంచమునకు వ్యక్తపరచబడినాడు.}

2) జగదంశ-జీవాత్మ - మతము:-

{వివరణ:- ఆత్మ లేదా జీవాత్మ అనునది భగవంతుడు ద్వారా సృష్టించబడిన ఈ సృష్టిలోని ఒక భాగము మాత్రమే (జగదంశ). ఆత్మ అనునది జడ శక్తి రూపము. జీవాత్మ అనునది చైతన్యము, ఇది ఒక నిర్దిష్టమైన మెదడు-నాడీ వ్యవస్థలో జడ శక్తి యొక్క నిర్దిష్టమైన పని రూపాంతరము. ఈ రెండు పదాలు సుమారు ఒకే అర్థంలో ఉపయోగించబడతాయి. ఆత్మ లేదా జీవాత్మ సృష్టిలో ఒక భాగమనియు మరియు ఊహాతీత భగవంతుడు కాదనియు దీని అర్థము. ప్రతి జీవాత్మ భగవంతుడు కాదనియు మరియు ఏ జీవాత్మ భగవంతుడు కాదనియు మనము చెప్పలేము. ఊహాతీత భగవంతుడు తేజోమయ లేదా నరావతారముగా అవతరించినప్పుడు, భగవంతునిచే ఎన్నుకున్న ఒకానొక తేజోమయ లేదా నర రూపముతో పూర్తిగా విలీనం అవుతాడు. అటువంటి జీవాత్మ ఊహాతీత భగవంతుడే. ఈయన దృష్టికి కనిపించును మరియు ఊహించదగినవాడు. సాపేక్ష ప్రపంచంలో (relative world) ఆత్మ ఒక భాగము కనుక సాపేక్ష నిజము (relative reality) మాత్రమే కాని సంపూర్ణ సత్యము (absolute reality) లేదా భగవంతుడు కాదు.}

3) జ్ఞానభక్తిసహకృత-కర్మయోగమార్గ - మతము:-

{వివరణ:- భగవంతుని అవతారము బోధించిన ఆధ్యాత్మిక జ్ఞానము, భక్తి అనే ప్రేరణను కలుగచేయును. ఈ ప్రేరణే భావరూప జ్ఞానమును ఆచరణాత్మక భక్తిగా మార్చును (కర్మయోగము). కర్మయోగము రెండు విధములుగా ఉంది:- ఎ) కర్మ సంన్యాసము మరియు బి) కర్మఫల త్యాగము. ఇది భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహమును పొందే మార్గము. జ్ఞానము నీరు వంటిది, భక్తి ఎరువు వంటిది మరియు అభ్యాసం మామిడి మొక్క వంటిది, దీనికి మాత్రమే భగవంతుని అనుగ్రహము లభించును. భగవంతుని అనుగ్రహమును పొందటానికి ప్రతి జీవునకు ధర్మ మార్గము (ప్రవృత్తి) యొక్క ఆచరణము తప్పనిసరి. ఆధ్యాత్మిక మార్గము లేదా భగవంతుని అనుగ్రహమును లక్ష్యంగా చేసుకునే నివృత్తి మార్గము  జీవుని ఇచ్ఛానుసారము మాత్రమే ఆచరించ వచ్చును.

ఇది ఆధ్యాత్మకములోని మూడు అంశములగు జీవుడు, తెలుసుకోవలసినవాడు లేదా గమ్యము (భగవంతుడు) మరియు భగవంతుని పూర్ణ అనుగ్రహమును పొందే మార్గము గురించిన  జ్ఞానము అని పిలువబడే త్రిపుటికి సంబంధించిన దత్త స్వామి యొక్క తత్త్వశాస్త్రము. ఇదియే దత్తస్వామి యొక్క మూడు అంశములైన త్రిపుటిపై తత్త్వశాస్త్రము (దత్తస్వామి- త్రిసూత్ర - మతము).

 
 whatsnewContactSearch