home
Shri Datta Swami

పరమపూజ్య శ్రీశ్రీశ్రీ దత్తస్వామి వారి దివ్య ఉపన్యాసములు

 Showing 181 – 200 of 269 Records

Translation: ENG 

ఉపోద్ఘాతము

వర్తమాన దత్తావతారులైన పరమపూజ్య శ్రీశ్రీశ్రీ దత్తస్వామి వారు తెలుగు భాషలో జ్ఞానసరస్వతి అను శీర్షికతో అనేకములైన దివ్యోపన్యాసములను అనుగ్రహించినారు. ఈ శీర్షిక క్రింద ఆ దివ్యోపన్యాసములన్నియును వరుసగా క్రోడీకరించి అందించబడును. సాధన అనగా ఏమి, సాధన ఏ విధంగా...(Click here to read)


జీవుని అహంకారము - స్వామి బోధ

Posted on: 27/12/2024

[22-01-2003]

చేసేది సాయి పాడేది సాయి -
చెప్పేది సాయి ఓరన్నా!
గుణములు సాయివి దోషాలు నావి -
కీర్తి సాయిది ఓరన్నా!
ద్వారకమాయికి బయటనున్నట్టి...

Read More→


నిజమైన ప్రేమయే నిస్స్వార్థ భక్తి

Posted on: 24/12/2024

Updated with Part-3 on 26 Dec 2024

[07.01.2003] Part-1: పరమాత్మ బ్రహ్మ, విష్ణు, శివాత్మకుడైన త్రిమూర్తి స్వరూపుడు. అట్లే జీవుడును త్రిమూర్తి స్వరూపుడే. జీవునిలో గల త్రిమూర్తులు అసూయ, అహంకారము, మమకారము. అహంకారము చేత అసూయ మరియు మమకారము ఏర్పడుచున్నవి. మమకారమునే స్వార్థము అందురు. జపము, ధ్యానము, భజన మొదలగు వాటి కన్నను సేవ అత్యుత్తమమే. కానీ సేవ కూడా ఏ ప్రతిఫలమును కోరక స్వార్థము లేనిదై యుండవలయును. జపము, ధ్యానము, భజన మొదలగునవి...

Read More→


త్యాగేనైకే అమృతత్వ మానసుః అనెడి వేదవాక్య వివరణ

Posted on: 21/12/2024

Updated with Part-3 on 23 Dec 2024

[02-01-2003] Part-1:  "త్యాగేనైకే అమృతత్వ మానసుః" అని శ్రుతి. త్యాగము చేతనే పరమాత్మ లభించును. త్యాగము అనగా దానము. దానమే దత్త శబ్దార్థము. కావున స్వామి పేరులోనే స్వామిని చిక్కించుకునే మార్గము బోధపడుచున్నది. దానము అనగా ధనము యొక్క దానము మాత్రమే కాదు. స్వామి పరీక్షించినపుడు స్వామి బంధము నుండి అన్ని బంధములు తక్కువేయని...

Read More→


అసూయా అహంకారములే నాస్తికతకు కారణము

Posted on: 19/12/2024

Updated with Part-2 on 20 Dec 2024

[31-12-2002 రాత్రి 10 గం.లకు] నాస్తికుడగు జీవుడు భగవంతుని అంగీకరించపోవుటకు కారణము వానిలో మేరు, వింధ్య శైలముల వలెనున్న అసూయా-అహంకారములే. భగవంతుడనగా తన కన్న ఎన్నో రెట్లు గొప్పవాడని అర్థము. భగము కలవాడు భగవంతుడు. భగము అనగా మాహాత్మ్యము అనగా గొప్పతనము. బ్రహ్మము అను శబ్దమునకు కూడ గొప్పతనము కలది అనియే అర్థము. తనకన్న లేక తన జాతియగు...

Read More→


భీముడే భగవంతునికి ఉత్తమసేవకుడు

Posted on: 17/12/2024

Updated with Part-2 on 18 Dec 2024

[28-12-2002] Part-1: ధర్మరాజు అర్జునుల కన్నను ఆంజనేయ అంశగల భీముడు ఉత్తమ సేవకుడు. భీముడు వాయుపుత్రుడు. "వాయు ర్వై క్షేపిష్ఠో దేవతా" అను శ్రుతి ప్రకారము వాయువు అనగా దేవతలలో శ్రేష్ఠమైనవాడు అనగా దేవదేవుడైన శివుడే. కావుననే శివావతారము హనుమంతుడు. హనుమంతుడు, భీముడు, మధ్వుడు ఈ మువ్వురు వాయుదేవుని అవతారములని ప్రసిద్ధి. ధర్మరాజు సత్త్వగుణము. అర్జునుడు రజోగుణము. భీముడు తమోగుణము. శివుడును తమోగుణ స్వరూపుడని...

Read More→


సంపూర్ణ భక్తుడు - అసంపూర్ణ భక్తుడు

Posted on: 16/12/2024

భక్తుడు అనగా తన కర్మఫలములను స్వామి అనుభవించునని తెలిసి వాటిని తానే అనుభవించెదననియు వాటిని స్వామి రద్దు చేయవద్దు అని ప్రార్థించెడివాడు. రద్దు చేయుట అనగా స్వామియే స్వయముగా అనుభవించుట అని తెలిసినవాడే జ్ఞానియగు భక్తుడు. అజ్ఞానియగు భక్తుడు కర్మఫలములను రద్దు చేయగల శక్తి స్వామికి ఉన్నది కావున వాటిని రద్దు చేయమని అర్థించును. అట్టివాడు స్వామి యందు నిజమైన భక్తి కలవాడు కాడు. అట్టి భక్తుడు స్వామిని అరాధించుచు మొండిపట్టును...

Read More→


అష్టాంగయోగము

Posted on: 15/12/2024

1. యమము, 2. నియమము, 3. ఆసనము, 4. ప్రాణాయామము, 5. ప్రత్యాహారము, 6. ధారణ, 7. సమాధి అనెడి ఈ ఎనిమిది భగవంతునితో యోగమునకు అష్టాంగములుగా తెలసికొనవలెను...

 

Read More→


బ్రహ్మము తర్కమునకు అందదు

Posted on: 14/12/2024

[29.11.2002] బ్రహ్మము తర్కమునకు అందదు అని శ్రుతులు చెప్పుచున్నవి. "నైషా తర్కేణ", "అతర్క్యః" అని శ్రుతులు. తర్కమనగా పదిమంది పండితులు తర్కించి తమ బుద్ధులతో నిర్ణయించినది. ఒక్కడే చూచి నిర్ణయించినప్పుడు వాడు భ్రమకు గాని కంటి దోషమునకు కాని లోను కావచ్చును. తర్కము చేత నిర్ణయించినపుడు ఎవరి బుద్ధికిని అందదని సారాంశము. "న మేధయా”, “యో బుద్ధేః పరతః" అను శ్రుతులు. ఇక వాక్కులకుగాని, కన్నులకు గాని చిక్కుననుకొనుట హాస్యాస్పదము...

Read More→


శ్రీదత్త మతసమన్వయ యోగము

Posted on: 13/12/2024

త్రిమూర్తులే స్వయముగ మతత్రయాచార్యులుగా అవతరించినారు. శంకర, రామానుజ, మధ్వాచార్యులు ఆయా కాలముల పరిస్థితులలో ప్రచారము చేసిన మతములను సమన్వయ పరచుటకే ఈ “దత్తమత సమన్వయయోగము” అనుగ్రహించబడినది. పరమార్థదశ స్వామి యొక్క స్థితి. వ్యయహార దశ జీవుని స్థితి. వ్యవహార స్థితి లోని జీవుడు పరమార్థ స్థితిలోని వాక్యములను విన్నచో భ్రష్టుడగును. అనగా జీవుడు నా స్థితివాక్యములను తన స్థితిలో సమన్వయించుకొన్నచో...

Read More→


శ్రీమధ్వాచార్యుల వారు - ద్వైతసిద్ధాంతము

Posted on: 12/12/2024

నేను బ్రహ్మదేవుడనైన శ్రీమధ్వాచార్యుడను. నిప్పురవ్వ యొక్క ఉనికి అత్యల్పమైననూ, ఉన్నది. అయితే దానిలోని దాహగుణము చాలా తక్కువ కాన దాదాపు లేనట్లే. అంటే అది బూడిదగుణముగా తీసుకొనవచ్చును. కాన మహాగ్ని...

Read More→


శ్రీరామానుజాచార్యులవారు - విశిష్టాద్వైతసిద్ధాంతము

Posted on: 11/12/2024

నేను విష్ణుదేవుడైన శ్రీరామానుజాచార్యుడను, జీవుని కన్నా చాలా ఎక్కువదియగు ఈ జగత్తు సత్యమేనని రామానుజ, మధ్వులు చెప్పిరి. అత్యల్పమైన ధర్మమును వేరు ధర్మముగా తీసుకొనవచ్చును, కాన అగ్ని కన్న భిన్నమైన ధర్మము కలదని రామానుజ, మధ్వులు స్థాపించిరి...

Read More→


శ్రీశంకరాచార్యుల వారు - అద్వైతసిద్ధాంతము

Posted on: 10/12/2024

నేను శివదేవుడనైన శంకరాచార్యుడను. త్రిమూర్తులే స్వయముగా మతత్రయాచార్యులుగా అవతరించినారు. అత్యల్ప పంచభూతములతో కూడిన ఈ జగత్తు అసత్యమని శంకరులు చెప్పిరి. అత్యల్పమును అభావముగా భావించవచ్చును గదా. అత్యల్పమైన ఈ జగత్తు సత్యము కాదు. అసత్యమూ కాదు. అందువలన మిథ్య అనబడును. ఇది నాకు మాత్రమే వర్తిస్తుంది. అంతే కాని జీవునికి కాదు. అత్యల్పజగత్తులో జీవుడు ఇంకనూ అత్యల్పమైనాడు...

Read More→


దాదాపు అనూహ్యమైన జీవచైతన్యము బ్రహ్మమగునా?

Posted on: 07/12/2024

Updated with Part-3 on 09 Dec 2024

[30.11.2002] Part-1: సృష్టిలో చైతన్యము (awareness) ఊహకు అందకయున్నది. ఇది శక్తిస్వరూపము అయినప్పటికి ఒక జడపదార్థము నందు చైతన్యమును మనము తీసుకొనిరాలేకున్నాము. కాంతి లేని చీకటి ఉన్న ప్రదేశమున కాంతిని తీసుకురాగలుగుచున్నాము. చల్లని ప్రదేశమున ఉష్ణమును తీసుకురాగలుగుచున్నాము. మరణానంతరము శరీరములో చైతన్యమును తీసుకురాలేకున్నాము. ఈ చైతన్యము నేటి విజ్ఞానవేత్తలకు (scientists) సైతము ఊహకు అందకయున్నది...

Read More→


ప్రత్యక్ష నరావతారుని వదలిన అంతయును నష్టమే

Posted on: 05/12/2024

Updated with Part-2 on 06 Dec 2024

[భగవాన్‌ శ్రీసత్యసాయినాథుని జన్మదినోత్సవ సందర్భంగా, శ్రీ దత్తస్వామి ఇచ్చిన సందేశము] “ఇహ చే దవేదీ దథ సత్యమస్తి, న చే దిహావేదీ న్మహతీ వినష్టిః” అని శ్రుతి చెప్పుచున్నది. దీని అర్థమేమి? ప్రత్యక్షముగా లభించినదే సత్యము. ప్రత్యక్షమును వదలినచో అంతయును నష్టమే. ప్రత్యక్షమే సత్యము. పరోక్షమంతయును భ్రమయే. చార్వాకుడు ప్రత్యక్షప్రమాణమునే విశ్వసించినాడు. చార్వాకుడు ఒక మహర్షి. అతడు నాస్తికుడని అందరును ఖండించిరి. కాని షడ్దర్శనములలో చార్వాకదర్శనమును...

Read More→


దత్తుడంటే సాక్షాదుపాసనకోసమే అవతరించినవాడు

Posted on: 04/12/2024

దత్తుడు అంటే – లోకమునకు నరావతారముగా అందించబడినవాడే. “మానుషీం తనుమాశ్రితమ్” – మానవశరీరమును ఆవహించి అవతరించినవాడు. మనకు దర్శన, స్పర్శన, సంభాషణ, సహవాసము అనుగ్రహించెడివాడు. మానవులకు జ్ఞానమును బోధించాలంటే మానవకారమునే ఆశ్రయించి రావాలి. అంతేకాని పటములోనుండిగాని, శిల్పములోనుండిగాని, జంతువు రూపములోగాని వస్తే జ్ఞానాన్ని బోధించటానికి వీలు లేదు. అయితే విగ్రహములు ఎందుకు వచ్చినట్లు? మానవులు...

Read More→


కోరికలకోసం ప్రయత్నిస్తే అవి అందవు

Posted on: 03/12/2024

[12.04.2005, శ్రీదత్తప్రభువుల దత్తవాణి. పార్థివ నామ సం|| చైత్ర శుద్ధ చవితి - మంగళవారం - సా|| 3-30 గంటల సమయం] దేనికోసమూ ఆరాటపడరాదు. ఎప్పుడూ ఆశ పడరాదు. దేనినీ ఆశ పడరాదు. ఆశ పడితే అది వెనుకకుపోతుంది. రాజ్యం పాండురాజుది. ఆయన వేటకు వెళ్తూ ధృతరాష్ట్రుని రాజప్రతినిధిగా కూర్చోపెట్టి వెళ్ళినాడు. అప్పటి నుండి ఆ రాజ్యాన్ని ధృతరాష్ట్రుడు పరిపాలించడం మొదలుపెట్టినాడు. పాండవులనే అరణ్యానికి పంపినాడు. తిరిగి వచ్చిన తర్వాత ధర్మరాజుకు రాజ్యకాంక్ష లేకుండా రాజ్యం వీళ్ళదైనప్పటికి కాంక్ష లేక ఐదు ఊళ్ళు అడిగినాడు. అర్జునుడైతే అసలు ఏమీ అక్కరలేదన్నాడు...

Read More→


రాధ, హనుమదాదుల పొరపాట్లు, గెలుపు ఓటములు జీవబోధ కొరకే

Posted on: 01/12/2024

Updated with Part-2 on 12-Dec-2024

[21-01-2003] Part-1: హనుమంతుడు, రాధ, సత్యభామ, రుక్మిణి మొదలగు పాత్రలన్నియును జీవులుగా నటించుచున్న శ్రీదత్తుని వేషములే. వీరందరును జీవులకు ఆదర్శములను సాధనలో నిలుపుట ఎట్లుండును అని జీవులకు బోధించుటకై గెలుపు, ఓటములను పొందుచు, లోపమున్నట్లు నటించుచున్నవారే తప్ప నిజముగా వారిలో ఎట్టి లోపములు లేవు. కానీ, మానవులు ఈ నాటకముల నుండి గుణపాఠములను నేర్చుకొనక, నిజముగా వారిలో లోపమునట్లు భావించుచుందురు...

Read More→


భాగవత రహస్యాలు - అంతరార్ధములు

Posted on: 30/11/2024

[21.01.2006] ప్రపంచముపై విరక్తి ఏర్పడినప్పుడే పరమాత్మపై అనురక్తి పొడసూపుతుంది. విషయసుఖాలు శాశ్వతములని భావించినంతకాలము మనసు భగవానునియందు లగ్నము కాదు. అనిత్యమైన ఈ దృశ్యమాన ప్రపంచముపై రోత జన్మించగా బ్రహ్మర్షులైన గోపికలు భగవానుని ఆశ్రయించి, అభయహస్తమును చూపి రక్షించమని ప్రార్థించినారు. నిస్సారమైన సంసారములో మానవునకు శాంతి లభించదు. దారాపుత్రాదులయందు, ధనవస్ర్తాదులయందు మనం ఏర్పరచుకున్న వ్యామోహమే...

Read More→


మార్గశిరపూర్ణిమ దత్తజయంతి దివ్యవాణి

Posted on: 29/11/2024

[15-12-2005] 1) ఓం జగదీశ్వరాయ నమః,  2) ఓం కుటుంబేశ్వరాయ నమః,  3) ఓం దేహేశ్వరాయ నమః  4) ఓం ఆత్మేశ్వరాయ నమః,  5) ఓం సర్వేశ్వరాయ నమః

1. జగదీశ్వరాయ నమః – జగదీశ్వరుడు దత్తుడు: జీవుని చేతిలో ఏమీ లేదు. అంతా స్వామి చేతిలోనే యున్నది. భీష్మాదులును...

Read More→


హనుమంతులవారి వాలము (తోక)

Posted on: 28/11/2024

[10-07-2007] డార్విన్ సిద్ధాంతము ప్రకారము మానవుడు కోతినుండి పుట్టాడు. కోతికి తోక వున్నది. దోమలను, ఈగలను దులుపుకోడానికి కోతి తోకను వాడుతుంటుంది. ఆ తోక కూడా బలంగానే ఉంటుంది. అట్టి కోతినుండి మానవుడు ఉద్భవించాడని, మానవునకు చేతులు బలిష్ఠమై, కాళ్ళు బలిష్ఠమై ఉండుట చేత అతనికి ఇక తోకతో అవసరం లేకపోయింది. అందువల్ల మానవులకు తోక లేదు, కానీ గుర్తుగా చిన్న వంకర ఎముక ఉన్నది అని డార్విన్ సిద్ధాంతము. అంటే, అవసరము ఉన్నంతవరకు తోక ఉన్నదని, అవసరము...

Read More→


 
 
 whatsnewContactSearch