Showing 61 – 80 of 203 Records
Translation: ENG
వర్తమాన దత్తావతారులైన పరమపూజ్య శ్రీశ్రీశ్రీ దత్తస్వామి వారు తెలుగు భాషలో జ్ఞానసరస్వతి అను శీర్షికతో అనేకములైన దివ్యోపన్యాసములను అనుగ్రహించినారు. ఈ శీర్షిక క్రింద ఆ దివ్యోపన్యాసములన్నియును వరుసగా క్రోడీకరించి అందించబడును. సాధన అనగా ఏమి, సాధన ఏ విధంగా...(Click here to read)
Gems: p
p) నరావతారములో వచ్చి బ్రహ్మజ్ఞానమును బోధించు సద్గురువే పరమాత్మ: పరమాత్మ నరరూపములో వచ్చి పరమాత్మను గుర్తించు బ్రహ్మజ్ఞానమును బోధించునపుడు ఆ బోధకుడే పరమాత్మ అను విషయము నీకు స్పష్టమగును. పరమాత్మ కాని వాడు పరమాత్మను గురించి బోధించజాలడు. నన్ను నేను తప్ప ఎవడును తెలియజాలడని గీతావచనము - ‘మాం తు వేద న కశ్చన’. వేదములో కూడ బ్రహ్మమును తెలిసిన వాడు బ్రహ్మము తప్ప అన్యుడు కాడని వినబడుచున్నది...
Gems: o
o) నరావతారము: నరావతారమును గుర్తించుటకు కేవలము ఆ సద్గురువు బోధించు జ్ఞానమును పరిశీలించియే నిర్ణయించవలెను. ఆ జ్ఞానబోధలో సత్యములైన సమన్వయములు, స్పష్టముగా ఆత్మలోనికి దూసుకొని పోవు బోధన విధానము, అట్టి జ్ఞానము మరి ఏ ఇతర జీవులకు సాధ్యము...
Gems: m-n
m) జ్ఞానబోధ: ప్రకృతి నియమములను అనుసరించియే ఇట్లు జ్ఞానబోధను చేయుటకు అవకాశము ఉన్నప్పుడు పరమాత్మ దానిని ఉపయోగించుకొనును. ప్రకృతిసిద్ధముగా సులభముగా ఒక పనిని సాధించుకొనుట వివేకవంతుని లక్షణము. ఒక పని సులభముగా నెరవేరినపుడు దానిని కష్టసాధ్యమైన మార్గములో ఏల చేయవలయును? నీరు పంపు నుండి ధారాళముగా లభించునప్పుడు దానిని వదలి హైడ్రోజన్
Gems: f-l
f) రాధ: బృందావనములో రాధను మొట్ట మొదటి సారిగా రహస్యముగా వివాహమాడి ఎంతో ప్రాణాధికముగా ప్రేమించినాడు. కాని పెండ్లి అయిన రెండు సంవత్సరములలోనే బృందావనమును వదలి ఒక్కసారియైనను రాధను చూచుటకు రాక వేలకొలది స్త్రీలను వివాహమాడి ఆనందముతో యుండినాడు. ఇంత దుర్గుణ పరాకాష్ఠను ప్రదర్శించుటలో ప్రభువు యొక్క ఆంతర్యమేమి? ఇట్టి పరిస్థితిలో స్త్రీస్వభావసిద్ధమైన అసూయా గుణములు రాధకు ఎంతో రావలసియున్నవి. కాని ఆమె అణుమాత్రమైనను...
Gems: a to e
a) కృష్ణావతార రహస్యము: శ్రీకృష్ణుని స్మరించగానే ఆయనలో మనకు మూడు దోషములు వెంటనే గోచరించి ఆయన దైవత్వమును శంకించుటకు కాని లేక నిరాకరించుటకు కాని దోహదము చేయును. మానవునకు దోషదర్శనము చాలా శీఘ్రముగా కలుగుచున్నది. ఈ మూడు దోషములు ఏమనగా –
ఈ విషయములో ఇతర మతములు కూడా హిందూ మతమును తప్పు పట్టుచున్నవి. దీనికి కారణము కృష్ణుని...
[11.11.2002] అవతారము అనగా క్రిందకు దిగుట. అవతారము తత్త్వములో ఎట్టి మార్పు రాదు. పై అంతస్థులోని వజ్రము, క్రింద అంతస్థు లోనికి దిగినంత మాత్రమున గులకరాయి కాదు. అట్లే జీవుడు సాధన ద్వారా పరమాత్మతో కైవల్యము చెందినంత మాత్రమున పరమాత్మ కాజాలడు. అద్వైతకైవల్యము ఆవేశమే, అనగా పూనకమే. ఈ పూనకము పోగానే మరల జీవుడు యథాస్థానమునకు చేరును. క్రింది అంతస్థులో యున్న గులక రాయి, పై అంతస్థులోనికి ఎక్కినంత మాత్రమున అది వజ్రము...
[13.11.2002] పరమాత్మపై భక్తి కలుగక పోవుటకు లౌకిక విషయములందు ప్రేమ కలుగుటకు కారణమేమి? మనము లౌకికములైన విషయములందే ఆసక్తి కలవారి యొక్క సంగమునందే సదా ఉండుచూ రమించుచున్నాము. వారితో సదా లౌకిక విషయములను గురించియే మాట్లాడుచూ ఆనందముగా వినుచున్నాము. ఈ లౌకిక విషయములు వారి నుండి సదా ఇంజెక్షన్ వలె మన లోనికి ఎక్కుచున్నవి. వీటి ద్వారా లౌకికమగు జ్ఞానమే మనలో పెరుగుచున్నది. ఈ లౌకికజ్ఞానమే లోకబంధములపై ప్రేమకు...
[08.11.2002] నాయనా! శ్రద్ధగా విను, అనుసరించి తరించు. దత్తతత్త్వము దానము. ఈ దానములో ‘దేశము’, ‘కాలము’, ‘పాత్ర’యను మూడు భాగములుండును.
దేశము అనగా:- కాశీ మొదలగు పుణ్యక్షేత్రములందు దానము చేయుట.
కాలము అనగా:- వైకుంఠ ఏకాదశి, మార్గశిర పూర్ణిమ, శ్రీపంచమి మొదలగు పుణ్యతిథులందు దానము చేయుట. (మేము కాలమునకు ప్రాధాన్యము నిచ్చియే గదా మార్గశిరపూర్ణిమకు అన్నవరములో శ్రీసత్యదేవుని సమక్షంలో అన్నదానము, కాశీలో అక్షయ తదియ...
[07.11.2002] దత్తుడనగా దానము. అనగా స్వార్థము లేని త్యాగము. ఎవడు స్వార్థమును పరిపూర్ణముగా వదలి, పరిపూర్ణమైన త్యాగస్వరూపుడగుచున్నాడో వాడే దత్తుడగుచున్నాడు. స్వార్థము ఎంత విడచి పోవుచున్నదో ఎంత త్యాగము పెరుగుచున్నదో అంతగా వాడు దత్తునకు సమీపమగుచున్నాడు. దత్తుడు యోగియైనను...
శ్రీదత్తభగవానుడు పరబ్రహ్మమని చెప్పినపుడు ఆ మాట నోటితో చెప్పుటకు, చెవులతో వినుటకు మాత్రమే పనికి వచ్చును. ఏలననగా పరబ్రహ్మము ఊహించుటకు సైతము వీలు కానిది. కావున ‘దత్తుడు బ్రహ్మము’ అను వాక్యమునకు అర్థము దత్తుడు ఊహకు అందడనియే, మరి ఊహకు అందని దత్తుడు అత్రి మహర్షి యొక్క కన్నులకు ఎట్లు గోచరించినాడు? దేవతలు కాని, ఋషులు కాని పరబ్రహ్మమును తర్కించుటకు సైతము చేతకాని వారు గదా. అయితే "దేవతలును ఋషులును యుగ యుగముల...
[26.03.2003] లోకములో కష్టములకు కుంగరాదు. సుఖములకు పొంగరాదు. సుఖములు పైకి లేచిన తరంగములు, కష్టములు క్రిందకు వచ్చిన తరంగములు. తరంగముల యొక్క బరువును తీసుకున్నపుడు ప్రతి తరంగమునకు శృంగము (crest), ద్రోణి (trough) అని రెండు వుండును. శృంగమే సుఖము. ద్రోణియే కష్టము. ఒకదాని వెనుక రెండవది ఉండును. కాలచక్రము తిరుగుచుండగా చక్రములోని క్రింది అరలు పైకి, పై అరలు క్రిందికి వచ్చుచుండును. కావున కష్టము గానీ, సుఖము గానీ నిత్యము ఉండదు. అవి ఎండ-నీడల...
[09-11-2002] జ్ఞానము కన్నను భక్తి గొప్పది. భక్తి కన్నను సేవ గొప్పది. జ్ఞానము పెరిగిన కొలది భగవంతునిపై భక్తి లేకపోవుటకు కారణము భగవంతుని గురించి జ్ఞానము తక్కువగా యుండుటయే. అయితే జ్ఞానము అనగా నేమి? పరమాత్మను గురించి తెలుసుకొనుటయే జ్ఞానము. మనకు పరమాత్మను గురించి తెలిసినది...
[12.11.2002] భగవంతుని మనము నిత్యము పూజించుచున్నాము. ఆ పూజలలో మనము ఎంతో భక్తిని కలిగియున్నాము. అయితే ఆ భక్తి పరమాత్మపై నున్న భక్తి కాదు. ఒక కోరికను సాధించుకొనుటకు పరమాత్మను సాయము కోరుచున్నాము. మనకు అనారోగ్యము వచ్చినపుడు వైద్యుని వద్దకు వెళ్తాము గదా. అపుడు ఆ వైద్యుని ఎంతో వినయముతో, శ్రద్ధతో గౌరవించుచున్నాము. ఆ గౌరవము నిజముగా డాక్టరుపై కానే కాదు. మన అనారోగ్యమును ఆ వైద్యుడు తగ్గించును...
Updated with Part-3 on 15 Mar 2025
[05-06-2000] ఈ విశ్వములో మూడు ప్రధాన మతములు కలవు.1) హిందూ మతము: ఇది బ్రహ్మస్వరూపము. జ్ఞానాత్మకము. వేదాంతశాస్త్ర విచారముతో కూడినది. బుద్ధి యొక్క ప్రతిభ ఉండును. రజోగుణము ప్రధానముగా ఉండును.2) క్రైస్తవ మతము: ఇది విష్ణుస్వరూపము. దయా...
Updated with Part-2 on 12 March 2025
[11-02-2003] ‘ఆత్మానం రథినం విద్ధి’, ‘శరీరం రథమేవ చ’, ‘బుద్ధిం తు సారథిం విద్ధి’, ‘మనః ప్రగ్రహమేవ చ’, ‘ఇంద్రియాణి హయా నాహుః’ అనగా జీవుడు రథముపై కూర్చున్న యజమాని. శరీరము రథము. బుద్ధి సారథి. మనస్సు పగ్గములు. ఇంద్రియములు గుర్రములు. ఇందులో బుద్ధి సారథిగా ఉన్నది. ‘నిశ్చయాత్మికా బుద్ధిః’ అన్నారు. అనగా ఒక విషయమును నిర్ణయము చేయునది బుద్ధి. ‘సంకల్ప, వికల్పాత్మకం మనః’ అన్నారు. అనగా ఒక విషయమును ఒక విధముగా భావించి, దానిని కాలాంతరమున్న...
Updated with Part-3 on 10 March 2025
‘కర్మణోహ్యపి బోద్ధవ్యమ్’, ‘కిం కర్మ కిమకర్మేతి’, ‘కర్మయోగేన యోగినామ్’, ‘కర్మణ్యే వాధికారస్తే’ అను గీతా శ్లోకములలో కర్మ, వికర్మ, అకర్మ, కర్మయోగము అను నాలుగు శబ్దములు వాడబడినవి. సామాన్యమైన అర్థములో కర్మ, వికర్మ, కర్మయోగము అను మూడును ‘కర్మ’ అను శబ్దము క్రిందకే వచ్చును. ఏలననగా ఈ మూడింటిలోను పనిచేయుట అను ‘కర్మ’ వున్నది. ఇట్టి సామాన్యార్థము కర్మ శబ్దమునకు వ్యుత్పత్తి పరముగా వున్నది (దీనినే యోగము లేక యౌగికార్థము అనెదరు). అయితే కర్మకాండలో...
[13-04-2004] చైతన్య స్వరూపమగు మాయాశక్తి నుండి సమస్త విశ్వము పరిణామముగా ఉద్భవించినది. ఈ చైతన్యము నుండియే చైతన్య భిన్నమైన జడములు కూడా మాయ యొక్క విచిత్రతత్త్వము వలన ఉద్భవించినవి. ఈ జడములతో సహా విశ్వమంతయు లయమైనపుడు కేవల చైతన్యమే మిగులును. ఇది అద్వైతస్థితి. కాని ఇట్టి అద్వైతస్థితి నిజముగ జరుగకుండా ఈ సృష్టి ఉన్నంతకాలము అద్వైతస్థితిని గురించి మాట్లాడ ప్రయోజనమేమి?...
విగ్రహారాధనము:- వేదమే పరమప్రమాణము అని బ్రహ్మసూత్రములు చెప్పుచున్నవి. 1) ఆచార్యులు కూడ ఏ సిద్ధాంతమైనా వేదప్రమాణము ఆధారముగా ఉంటేనే భాష్యాలలో పలుకుతారు. శ్లోకములు వేదార్థాన్ని అనుసరించియుంటేనే అంగీకరిస్తారు. 2) ఇది సనాతన పండిత సంప్రదాయము. విగ్రహములను ప్రతీకలుగా ఆరాధించాలి. ప్రతీక అంటే అందుబాటులో లేని తత్త్వానికి...
Updated with Part-2 on 04 Feb 2025
[08-02-2003] ఒక గ్రామము నుండి మరియొక గ్రామమునకు పోయినంత మాత్రమున మనిషిలో ఎట్టి మార్పు రాదు. కావున మరణానంతరము జీవుడు ఈ లోకము నుండి మరియొక లోకమునకు పోయినంత మాత్రమున జీవునిలో ఎట్టి మార్పు రాదు. ఒక వస్త్రమును విడచి మరియొక వస్త్రమును ధరించిన మాత్రమున మనుజునిలో ఎట్టి మార్పు రాదు. అట్లే జీవుడు ఈ స్థూలశరీరము వదలి యాతనాశరీరము ధరించినంత మాత్రమున జీవునిలో ఎట్టి మార్పు రాదు. కావున ఈ లోకమున...
[22-03-2004] ఎన్నో సంవత్సరముల నుండి ఎందరో పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయములను నేను బోధించు ఈ జ్ఞానము తప్పక తుడిచి వేయగలదు. ఏలయనగా నేను బోధించు జ్ఞానము సత్యమేనని నీవు నీ వివేకముతో నిశ్చయించు కొనగలిగినచో వారి యొక్క అసత్యమైన జ్ఞానము వారు ఎంతమందియైనను...