home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా


శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా !
ప్రభుదత్త దత్తా ! నా దత్త దత్తా ! (పల్లవి)

దత్త ముత్తెము చూచితివా ? బ్రహ్మానందము పొందితివా?
దత్త దీపము వెలిగినదా? మాయ చీకటి తొలగినదా?
శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా ! ప్రభుదత్త దత్తా ! నా దత్త దత్తా !

1. దత్త నామము వింటివా? దత్త పాదము కంటివా?
దత్త దర్శనమైనదా? దత్త బోధలు ఎక్కెనా?
శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా ! ప్రభుదత్త దత్తా ! నా దత్త దత్తా !

2. దత్త పూజను సల్పితివా? దత్తావేశము వచ్చినదా?
దత్త గానము చేసితివా? దత్తోద్రేకము కల్గినదా?
శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా ! ప్రభుదత్త దత్తా ! నా దత్త దత్తా !

3. దత్త గద్దెను చేరితివా? దత్త ప్రభువుల మ్రొక్కితివా?
దత్త సేవలు చేసితివా? దత్త కరుణను పొందితివా?
శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా ! ప్రభుదత్త దత్తా ! నా దత్త దత్తా !

4. బ్రహ్మ విష్ణు శివ రూపం బండీ ! ముగ్గురమ్మల తత్త్వంబండీ !
ముక్కోటి సురల మూలంబండీ ! అదియే దత్తాత్రేయం బండీ !
శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా ! ప్రభుదత్త దత్తా ! నా దత్త దత్తా !

5. గణపతి షణ్ముఖ వీరుండండీ ! రామకృష్ణ హనుమానేనండీ !
సర్వ దేవతా సారం బండీ ! సర్వ సిద్ధ అవతారం బండీ !
శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా ! ప్రభుదత్త దత్తా ! నా దత్త దత్తా !

6. శ్రీ పాద శ్రీ వల్లభుడండీ ! నరసింహ సరస్వతి యేనండీ !
నారాయణ మాణిక్య ప్రభువండీ ! అక్కల్ కోట మహరాజేనండీ !
శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా ! ప్రభుదత్త దత్తా ! నా దత్త దత్తా !

7. సద్గురు షిరిడీ బాబా యండీ ! పుట్టపర్తి గల సాయే నండీ !
మూలవిరాట్టును గుర్తించండీ ! అందరి పూజలు అదియేనండీ !
అందరి శక్తులు అందరి మహిమలు అందరి సిద్ధులు అతడే నండీ !
శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా ! ప్రభుదత్త దత్తా ! నా దత్త దత్తా !

8. ఋషులకు సురలకె జారేడండీ ! మనుజుల కెట్టుల దొరికేనండీ !
నిర్మల భక్తికి మెచ్చేనండీ ! భోగ మోక్షముల నిచ్చేనండీ !
శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా ! ప్రభుదత్త దత్తా ! నా దత్త దత్తా !

9. దత్తయ్య కెదురే లేదండీ ! దత్తయ్య ఇస్తే నిలిచేనండీ !
సర్వ తపస్సుల ఫలమతడండీ ! చివరి జన్మలో చిక్కేనండీ !
శ్రీ దత్త దత్తా ! గురుదత్త దత్తా ! ప్రభుదత్త దత్తా ! నా దత్త దత్తా !

 
 whatsnewContactSearch