home
Shri Datta Swami

సంకలనము - శ్రీ చిలుకూరి బాలకృష్ణమూర్తి

 Showing 1 – 20 of 55 Records

Translation: ENG

భక్తులకు మనవి

(పరమపూజ్య శ్రీశ్రీశ్రీ దత్తస్వామి వారు దత్తభక్తుల జీవితాలలో చేసిన కొన్ని అద్భుతమైన మహిమల సంగ్రహము. వెబ్ సైట్ లో పోష్టు చేయబడుతున్న ఈ భాగములన్నియు శ్రీ చిలుకూరి బాలకృష్ణమూర్తి గారు మరియు ఇతర భక్తులచే సంకలనము చేయబడి, ప్రచురితమైన ‘మహిమయమున’ అను గ్రంథము నుండి గ్రహించబడినవి.)

ప్రొ॥ డా॥ ౙన్నాభట్ల వేణుగోపాల కృష్ణమూర్తి గారినే ‘స్వామి’ లేక ‘దత్తస్వామి’ అని భక్తులందరూ పిలుస్తారు. స్వామి సాక్షాత్తు శ్రీదత్తాత్రేయుడని భక్తుల ప్రగాఢ విశ్వాసము...(Click here to read)


శివలహరి - 9

19/07/2025

మంచి ఉద్యోగమును అనుగ్రహించుట.

మేము హైదరాబాదులో ఉన్న రోజులవి. మా పిల్లలు అందరూ ఉద్యోగాలలో స్థిరపడ్డారు. మా మూడవ కుమారుడు చి. రమణకు మంచి ఉద్యోగము దొరకలేదు అనే చింత మా దంపతులలో చోటు చేసుకున్నది. అప్పటికే స్వామి మా ఇంట్లో దత్తభక్తులుగా...

Read More →


శివలహరి - 8

18/07/2025

సంన్యాసి పరీక్ష.

ఆ రోజుల్లో స్వామిని దత్తభక్తులుగా వ్యవహరించేవారు. స్వామి, నేను, నా శ్రీమతి శ్రీశైలంలోయున్నాము. ఆనాడు శ్రీమల్లికార్జునుల సేవించి భ్రమరాంబ తల్లి దేవాలయానికి వెళ్ళాము. భ్రమరాంబాదేవి గుడిలో మేము ముగ్గురము...

Read More →


శివలహరి - 7

17/07/2025

శివుడు ఆదిత్య రూపుడు.

శ్రీశైలంలో ఉదయం ఎప్పుడూ శివునిమీద భజన క్యాసెట్లు వేస్తారు. అందులోను మొట్టమొదటి క్యాసెట్టు ఎప్పుడూ శివపరంగానే ఉంటుంది. ఒకరోజు స్వామి తెల్లవారుఝామున లేచి మాతో “ఈ రోజు శివుడు ఆదిత్యస్వరూపంతో ఉన్నాడు...

Read More →


శివలహరి - 6

16/07/2025

స్వామి వాక్యమే సత్యము.

ఒక భక్త దంపతులు విజయవాడలో వేడుకొనగా స్వామి "ఆవీరో జాయతాం పుత్రః" అని ఆశీర్వదించినారు. ఇది వేదములోని వాక్యము. దీని అర్థము "మీకు మంచి మొనగాడైన పుత్రుడు...

Read More →


శివలహరి - 5

15/07/2025

షిరిడిలో పుల్కాలను సృష్టించుట.

విజయవాడ వాస్తవ్యులు శ్రీ కోనేరు సత్యనారాయణ గారు షిరిడి యాత్ర చేయాలని సంకల్పించి, వారితో వారి సతీమణి శ్రీమతి శివకాంచన లత గారిని, వారి మాతృదేవత చిట్టెమ్మగారిని బయలుదేరతీసారు. వారితోపాటు మన స్వామిని కూడా తీసుకువెళ్ళడం...

Read More →


శివలహరి - 4

14/07/2025

రూపాయి నాణెము సృష్టించుట.

[శ్రీ నాగప్రసాద్, శ్రీమతి నాగశివరత్న ప్రభావతి] ఒక రోజు గుంటూరులో విశ్వప్రియ రియల్ ఎస్టేట్స్ అధినేత నాగప్రసాద్ గారి ఇంటిలో స్వామి భజన చేసినారు. ప్రసాద్ దంపతులు...

Read More →


శివలహరి - 3

13/07/2025

స్వామి “మూడు తలలోడు”

స్వామి ఒకరోజు విజయవాడ కృష్ణలంకలోని మా ఇంటి రెండవ అంతస్థులో శయనించారు. 3వ అంతస్థులో ఉన్న శ్రీదత్త పీఠమందిరంలో యథాప్రకారమే మేము శయ్యను వేసి చిన్న దిండును పెట్టి పవళింపు సేవ చేసి వచ్చినాము...

Read More →


శివలహరి - 2

12/07/2025

కమల గంధములు వెలువడుట.

[శ్రీ సోమయాజులు, శ్రీమతి కామేశ్వరమ్మ (అజయ్ తల్లిదండ్రులు)] స్వామి అజయ్ గారింట్లో మధ్య బ్రహ్మముఖముగా కల శ్రీబ్రహ్మదత్తుల స్వామి చిత్రమును ప్రతిష్ఠించారు కదా. అప్పుడు స్వామి “తన తనువున గల కమల గంధముల, త్రిభువనములు ఆహ్లాదము నొందగ” అంటూ కీర్తించారు...

Read More →


శివలహరి - 1

11/07/2025

సిద్ధపురుషులు స్వామిని దత్తునిగా గుర్తించుట.

[శ్రీశివానంద మహరాజ్] విశాఖపట్నములో షిర్డిసాయి పీఠాధిపతులు శ్రీశివానంద మహరాజ్ గొప్ప యతీశ్వరులు. సర్వసిద్ధులు కల యోగిశ్రేష్ఠులు. సంకల్ప మాత్రము చేత వస్తువులను సృష్టిస్తారు. వారి వయస్సు 500 సం॥ లని ప్రసిద్ధి. శ్రీ నరసింహ సరస్వతి శిష్యులైన ‘సిద్ధయోగి’ వీరేనని...

Read More →


విష్ణులహరి - 20

10/07/2025

నారదముని గానము-చికిత్స.

[శ్రీ ఆంజనేయశర్మ, శ్రీమతి కామేశ్వరమ్మ] శ్రీమతి కామేశ్వరమ్మ గారు, తన భర్త శ్రీ ఆంజనేయశర్మ గారితో సహావచ్చి స్వామి శరణమును కోరినది. ఆ శర్మగారు వాక్కు మందగించి, పక్షవాతమునకు గురియైనారు. స్వామి శర్మగారితో “స్వామి పాటలు పాడేటంత...

Read More →


విష్ణులహరి - 19

09/07/2025

జ్ఞానము ద్వారా రోగము పోయి ఆరోగ్యము పొందుట.

హైదరాబాదులో ఒక పండితుడు అష్టావక్రసంహిత అను పురాణము చెప్పుచుండెను. ఒక శ్లోకము వద్ద పండితుడు ఆగిపోయెను. ఆ శ్లోకార్థము చెప్పిన, శ్రోతలు రాళ్ళు వేయుదురని సంశయించెను. కానీ జనకుని గురువు అష్టావక్రుడు. శుకుని పరీక్షించిన...

Read More →


విష్ణులహరి - 18

08/07/2025

హనుమద్భక్తునికి గండము తప్పించుట.

1999 సం॥ ఆరంభములో శ్రీ కోనేరు సత్యనారాయణగారి తండ్రి గుంటెపోటుతో హైదరాబాద్ ఆసుపత్రిలో చేర్చగా, వారి ప్రమాదమును నివారించుటకై, శ్రీ సత్యనారాయణగారు స్వామిని అర్థించినారు. ఆ పని మీద మా ఇంటిలోనే స్వామి 3 రోజులు మృత్యుంజయ మంత్రానుష్ఠాన ధ్యానంతో...

Read More →


విష్ణులహరి - 17

07/07/2025

బాలికను కాపాడుట.

[శ్రీరామనాథ అయ్యర్, వారి ధర్మపత్ని, పుత్రిక] శ్రీ రామనాథ అయ్యర్ గారు బొంబాయిలో యుటిఐ బ్యాంక్ లో వైస్ప్రెసిడెంటుగా పని చేయుచున్నారు. ఒకసారి శ్రీ రామనాథ అయ్యర్ గారు స్వామిని దర్శించుట జరిగినది. ఇంతలో ఆయన కుమార్తెకు పెద్ద జబ్బు చేసినది. ఆ బాలికను ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో...

Read More →


విష్ణులహరి - 16

06/07/2025

సైన్సును మించిన శక్తి

గుంటూరులో జరిగిన సంఘటన వినిపించి తరింతునుగాక ॥ భగవంతుని మహిమల యందు పూర్తి విశ్వాసము కలుగని వారు ప్రత్యక్ష ప్రమాణము మీద ఆధారపడతారు. సైన్సునే నమ్మిన వారు వీరు. ఇక్కడ చెప్పబోయేది కేవలం సైన్సునే నమ్ము ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని అనుభవము...

Read More →


విష్ణులహరి - 15

05/07/2025

అతిసార, శూలవ్యాధులను పోగొట్టుట.

i) ఒకసారి అతిసారవ్యాధి, వాంతులు విపరీతంగా వచ్చి, నా పరిస్థితి అస్తవ్యస్తమైనది. ఆ రోజు స్వామి అజయ్ గారింటిలో ఉన్నారు. స్వామి అజయ్ గారితో "ఇంత దత్తసేవ చేసిన బాలకృష్ణమూర్తికి (నేను) ఆపద వచ్చినప్పుడు ఆదుకోకపోతే ఎలా?" అన్నారట...

Read More →


విష్ణులహరి - 14

04/07/2025

మృత్యువునుండి రక్షించుట.

[శ్రీ విజయరామ్, శ్రీమతి రమ, పవన్ (రమ పుత్రుడు), లావణ్య (రమ పుత్రిక)] ఒకసారి భక్తురాలైన రమకు హైదరాబాదులో తీవ్రమైన అనారోగ్యం వచ్చినది. అది ఒక విచిత్రమైన వ్యాధి. డాక్టర్లకు అంతుపట్టలేదు. ప్రతిదినము 3 గంటలు అయ్యేటప్పటికి క్రుంగిపోవటం, విలవిలలాడిపోవటం, ఇక ఆమె ప్రాణం పోతుందేమో అని భయపడటం జరుగుతోంది....

Read More →


విష్ణులహరి - 13

03/07/2025

భక్తుని రక్తపోటును స్వీకరించుట.

శ్రీ కోనేరు సత్యనారాయణగారు కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజీ ఛైర్మన్. వారికి స్వామియందు శ్రద్ధాభక్తులు కలవు. సత్యనారాయణగారు సత్యము, ధర్మము మూర్తీభవించిన అత్యుత్తమసాధకుడని...

Read More →


విష్ణులహరి - 12

02/07/2025

కాలిన బొబ్బలు స్వీకరించుట.

ఒకసారి స్వామి విజయవాడలో తన యజ్ఞోపవీతాన్ని తీసి దత్త చిత్రపటం వద్ద ఉంచి “ఒక దత్తభక్తుడగు మాదిగవాడు అగ్ని ప్రమాదమునకు...

Read More →


విష్ణులహరి - 11

01/07/2025

శస్త్రచికిత్స నొప్పులను తగ్గించుట.

శ్రీమతి వసుమతిగారికి శస్త్రచికిత్స జరిగినది. ఆవిడ ఆసుపత్రిలో విపరీతములగు నొప్పులతో బాధపడుచున్నది. రాత్రి 9 గం॥కు ఆమె భర్తయగు...

Read More →


విష్ణులహరి - 10

30/06/2025

సీతమ్మ గారి తలనొప్పి తగ్గించుట.

భక్తురాలు సీతమ్మగారు చాలా కాలమునుండి శిరోవేదనతో బాధపడుచుండెను. స్వామిని చూచుటకు మొదటి సారిగా ఆవిడ మా ఇంటికి వచ్చినది. అప్పుడు స్వామి...

Read More →


 
 
 whatsnewContactSearch