home
Shri Datta Swami

 07 Jun 2002

చిలుకూరు శ్రీ దత్త వేంకటేశ్వరుడు

ఏడు కొండల వాడను నేనేలే। ఏడేడు లోకాల ఏలికను నేనేలే।
ఆపద మొక్కుల వాడను నేనేలే। ఆ పన్నగాధిప శాయిని నేనేలే।
వడ్డికాసుల వాడను నేనేలే। వరముల వడ్డించు దాతను నేనేలే।
అడుగడుగు దండాల వాడను నేనేలే। అడుగుతో భూమిని కొలిచినది నేనేలే।
చిలుకూరులో నున్న విగ్రహము నేనేలే। చిలుకూరు వారింట నరరూపము నేనేలే।
గుర్తించిన వారు గురి తోడ వచ్చేరు। గుర్తించని వారు గుర్రుతో పోయేరు॥