home
Shri Datta Swami

 08 Jan 2002

అడుగో। అల్లడుగో। వేంకట దత్తుడు

(నారాయణుడు వైకుంఠమును వీడి శ్రీలక్ష్మి కొరకు భూలోకానికి పరుగిడుట)

అడుగో। అల్లడుగో। వేంకట దత్తుడు (పల్లవి)

తియ్య మామిడి చిగురు లేత పెదవులందు -
చిందెడి సన్న నవ్వు వాడు।
ఉదయాన సరసులో విచ్చుచున్న -
కమలాలబోలు నయనములవాడు॥
 
 
నీటుగానున్న సంపెంగ సుమము -
బోలు నాసంబుతో వెలుగువాడు।
పన్నీర పుష్పాల తళుకు లొలుకు -
లేత బుగ్గల నెర్రతనము వాడు॥
 
 
ఊర్ధ్వ త్రిపుండ్రంబులుజ్జ్వలముగా -
భాసించుచుండు నిటలంబువాడు।
తప్త కాంచన దీప్తి మెరుపులొప్ప -
పీతాంబరోజ్జ్వ లాంచలమువాడు॥
 
 
కొండ బండల మీద నర్ధరాత్రి -
పద్మ కొరకై పరుగుతోడ।
దిగుచున్న వాడతడు పలుగురాళ్ళ -
కాలి గాయముల లెక్కింపడెపుడు॥
 
 
నిస్వార్థ భక్తికై ప్రాణమైనను -
తృణముగా త్యాగంబు సేయువాడు।
కోటి యఙ్ఞములైన జపతపములు -
పూజలైనను వాని కట్టలేవు॥
 
 whatsnewContactSearch