home
Shri Datta Swami

 17 Jan 2002

ఏడు కొండలనున్న ఏకైక దేవరా !

ఏడుకొండలనున్న ఏకైక దేవరా !
ఏడేడు లోకాల నేలేటి రాయడా ! (పల్లవి)

నీ సాటి ఎవరు? నీరజలోచన! -
నీ ధాటి ఎవరికున్నది ? నిత్యుడ !।
నీపోటి ఎవరు? పరమబ్రహ్మమ ! -
నీ చేటి ఎవరు ఆ పద్మ తప్ప !।
ఐహికమ్ములమ్ము పెను దుకాణంబు -
తిరుపతి యనగా తలచుచున్నారు।
భక్తి సుధలనుచితంబుగా నిచ్చు -
ధర్మ సత్రమిది తెలియకున్నారు !॥
 
 
సతుల తగవుతో శిలయగుట కల్ల -
మంగ పద్మలకు కలహమే లేదు।
మంగ పద్మయను ఒక్కరె అనఘ -
మా స్వార్థముగని రాయివైనావు।
లంచాలనిచ్చి పనుల జేసుకొను -
ప్రభుత్వ కార్యాలయముగ తిరుమల।
మారిపోయెనిల ! నిశ్చేష్టుడగుచు -
రాతి బొమ్మగా మారిపోతివా॥
 
 
అన్నమయ్యకును పద్మావతికిని -
అందాలరూప మందించినావు।
లంచగొండులగు భక్తులకు నీవు -
కొండబండగా చూపట్టినావు।
ప్రేమయు కరుణయు బ్రహ్మానందము -
గడ్డకట్టెనిట పురుషరూపమా !।
నీ అందమెవరు చెప్పగలరిలను-
పాలమ్ముకొను ఆ గోపి తప్ప॥
 
 whatsnewContactSearch