
చేసిన పాపములను క్షమించమని శ్రీ దత్త భగవానుడిని ప్రార్థిస్తూ
అనుగ్రహించబడిన ఎనిమిది శ్లోకములు
సాహఙ్కృతి స్సహచరానపి సంవిధూయ,
స్వాత్మానమేవ సకలోత్తమ మావిధాయ, |
మత్తో మృగో వనచరేష్వివ జీవితోఽహమ్,
పాపక్షమాపణ పటో! ప్రభు దత్త! పాహి ||1||
ఎల్లవేళలా నేను అహంకారముతో గర్వించి తోటివారిని లెక్క చేయక వారిని దూరం పెట్టాను. ఎల్లపుడునూ సాటి మానవులతో పోల్చుకొని అందరికన్నా గొప్పవాడిగా, అందరికన్నా ఉత్తముడిగా నన్ను నేను భావించుకున్నాను. ప్రపంచమనే ఈ అడవిలో తోటి జంతువుల మధ్య మదించిన జంతువు వలె జీవించాను...
జీవులు ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవితాన్ని గడపాలని ఆలోచిస్తున్నారు. కళాశాలలో చేర్పించిన తమ కుమారుడు క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించి, పూర్తి స్వేచ్ఛగా జీవించినట్లైతే అప్పుడు వారే వానిని హెచ్చరిస్తారు. విద్యార్థి తన కళాశాల జీవిత లక్ష్యాన్ని అనగా డిగ్రీ పొందడమును గ్రహించినట్లే, ప్రతి ఒక్కరూ మానవ జీవిత లక్ష్యాన్ని గ్రహించాలి. ఇది ఎటువంటి ఆటంకాలు లేకుండా జీవించడము కాదు. అదే సత్యమైతే ఎలాంటి బాధ్యత లేకుండా...
శ్రీ దుర్గాప్రసాద్ అడిగిన ప్రశ్న: స్వామి! మీరు బోధించిన జ్ఞానాన్ని ఒక్క పదములో ఏ విధముగా వ్యక్తపరచగలము?
స్వామి సమాధానము:- ఈ మొత్తం జ్ఞానాన్ని మూడు పదాలలో చెప్పవచ్చు:- 1) దత్త-పరబ్రహ్మ- మతము: ఇది మూడు పదముల యొక్క మిశ్రమ పదము. ఈ మూడు పదములు ఏమనగా:- దత్త (ఉపాధిని కలిగిన ఊహాతీత భగవంతుడు) - పరబ్రహ్మము (మొట్టమొదటి ఊహాతీత భగవంతుడు) - మతము (తత్త్వజ్ఞానము). {వివరణ:- దత్త అనగా పరబ్రహ్మము సంపూర్ణంగా విలీనము అయిన మొదటి తేజోమయ అవతారము. దత్తుడికి మరియు అనూహ్య పరబ్రహ్మమునకు మధ్య ఎటువంటి భేదము లేదు. దత్త అనగా పరబ్రహ్మము తనను తాను ఒక తేజోమయ రూపములో ప్రకటించుకున్నవాడని, పరబ్రహ్మము...
Note: Articles marked with symbol are meant for scholars and intellectuals only