home
Shri Datta Swami

 20 Jun 2025

 

Telugu »   English »  

బ్రహ్మలహరి - దివ్యదర్శనముల నిచ్చుట - 24

బదరిలో స్వామి దర్శనమిచ్చుట.

[కు. సుస్మిత (శ్యాం రసియా)]

శ్రీమతి పద్మ, వేంకటేశ్వరరావు గార్లు బదరీయాత్రకు బయలుదేరుచు, స్వామికి నమస్కరించి, తమ వెంట ఉండి రక్షించమన్నారు. వారి చిన్న కూతురును స్వామి "శ్యాం రసియా” అని పిలిచేవారు. ఆ అమ్మాయికి ఆ మీరా భజన స్వామి పాడితే చాల ఇష్టము. బదరిలో కొండమార్గమున బస్సు పోవుచుండగా ఆ అమ్మాయికి స్వామి బస్సు పక్కన నడుచుకుంటూ దర్శనమిచ్చి, ఆ పాపను చూచి నవ్వినారు. ఆ పాప కూడ తిరిగి నవ్వినది. యాత్రనుండి రాగానే, స్వామి వారితో ముచ్చటిస్తూ “శ్యాం రసియా! నీకు ఒకచోట కనపడినాను. నిన్ను చూచి నవ్వితిని. నన్ను చూచి నీవు నవ్వినావు" అన్నారు. శ్యాం రసియా కొంతసేపు ఆలోచించి "అవును బదరిలో కొండమార్గమున బస్సు పక్కన నడుస్తూ స్వామి నన్ను చూచి నవ్వినారు" అన్నది. స్వామి వారి వెంట నడచి వారిని రక్షించినారన్నమాట.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch