home
Shri Datta Swami

 02 Jul 2025

 

Telugu »   English »  

విష్ణులహరి - 12

కాలిన బొబ్బలు స్వీకరించుట.

ఒకసారి స్వామి విజయవాడలో తన యజ్ఞోపవీతాన్ని తీసి దత్త చిత్రపటం వద్ద ఉంచి “ఒక దత్తభక్తుడగు మాదిగవాడు అగ్ని ప్రమాదమునకు గురియైనాడు, వాని కాలిన బొబ్బలను తీసుకుంటున్నాను” అని అన్నారు. వెంటనే స్వామి శరీరం మీద భయంకరంగా కాలిన బొబ్బలు గోచరించాయి. స్వామి 3 రోజులు నరకయాతనను అనుభవించినారు. ఎట్టి ఔషధమును, ఉపచారమును స్వీకరించకయే 4వ రోజు అవి అదృశ్యమైనవి. స్వామి మరల యజ్ఞోపవీతాన్ని ధరించినారు. స్వామి దృష్టిలో భక్తి యొక్క గాఢతయే తప్ప, కులప్రసక్తి ఎప్పుడును ఉండదని విశదము కాలేదా!

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch