home
Shri Datta Swami

 26 Jun 2025

 

Telugu »   English »  

విష్ణులహరి - 6

గుండెపోటు నుండి రక్షించుట.

[కామేశ్వరమ్మ]

కామేశ్వరమ్మగారు అజయ్ గారి అత్తగారు. ఆమె హృద్రోగముతో బాధపడుచుండెను. ఎప్పటికప్పుడే మృత్యువాత పడినట్లే అగుచుండెను. తల్లి అంటే మమకారం కల అజయ్ గారి భార్య నాగలక్ష్మి తన తల్లిని రక్షించమని కన్నీటితో స్వామిని అర్థించినది. అదే ఆమె మొదటిసారి స్వామిని దర్శించటము. స్వామి “పుట్టినవారు గిట్టక తప్పదు. నీవు నీ తల్లి వ్యామోహమును తెంచుకొనుము” అని హితవు చెప్పినారు. కానీ, లక్ష్మి తన పట్టును విడువలేదు. "ఇది నీ మొదటి కోరిక కావున చెల్లిస్తాను" అన్నారు స్వామి. అంతే! ఆమె తల్లి గుండెజబ్బు అదృశ్యమై వెంటనే స్వస్థురాలైనది. గుండెకు వెంటనే శస్త్ర చికిత్స చేయవలయునన్న వైద్యులు మరల పరీక్షించగా రోగము లేదు! ఇది మహిమ కాక మరేమిటి?

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch