home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

నేను దత్తుడనె?


నేను దత్తుడనె? వ్రాతలతో
నక్కయు పులియే? వాతలతో (పల్లవి)

జీవుడు జీవుడె, దేవుడు దేవుడె - శిలలు శిలలే కనకము కనకమె |
స్వామి స్వామియే దాసుడు దాసుడె - శ్రీ హనుమంతుడు బోధించినిదే ||

అష్టసిద్ధులును బ్రహ్మ ఙ్ఞానము - యోగ నిష్ఠయు పరమ భక్తియు |
ఐక్యము చెందిన మూర్తియె మారుతి - తానుసేవకుడ ననియె వచించెను ||

అద్వైతంబది ప్రమాదకరము - బ్రహ్మాஉహమ్మనె శంకర గురువు |
తప్త సీసము త్రాగెనతడు - మండన మిశ్రుడె ఓడె శాస్త్రమున ||

పూర్ణసిద్ధిని పొందకమునుపే - తానె బ్రహ్మమని తలచుట తప్పు |
సాధన ఆగును గర్వము పెరుగును - మధ్యలోనె పతనంబు లభించు ||

నేనె దైవమని రాక్షసాధములు - పూర్వము తలచిరి తలలు వంచిరి |
నిత్యము సేవక పదవియె పదిలము - హనుమంతుడిదే ఆశ్రయించెను ||

 
 whatsnewContactSearch