Showing 1 – 20 of 269 Records
Translation: ENG
వర్తమాన దత్తావతారులైన పరమపూజ్య శ్రీశ్రీశ్రీ దత్తస్వామి వారు తెలుగు భాషలో జ్ఞానసరస్వతి అను శీర్షికతో అనేకములైన దివ్యోపన్యాసములను అనుగ్రహించినారు. ఈ శీర్షిక క్రింద ఆ దివ్యోపన్యాసములన్నియును వరుసగా క్రోడీకరించి అందించబడును. సాధన అనగా ఏమి, సాధన ఏ విధంగా...(Click here to read)
సాధువంచనా హింసలే సత్యమఘము,
తన్నివారణ పుణ్యంబు, ధర్మకర్మి
సహకరించిన పరమాత్మ సంతసించు,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥116॥
తా॥ సాధువులను వంచించుట, హింసించుటయే నిజమైన పాపము. అట్టి పాపమును జరుగకుండా నివారించుటయే పుణ్యము. ఈ పుణ్యమును చేయువాడే ధర్మమును ఆచరించినవాడు. పరుల విషయము నాకెందుకని ఉపేక్షసేయక, కలుగజేసుకొని...
కాలదేశ విధానాలు కానరావు
సత్య నిస్స్వార్థ భక్తుని సరణిలోన,
తల్లి పసిపాప రీతిగా తత్త్వభక్తి,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥109॥
తా॥ నిజమైన స్వార్థము నాశించని భక్తిలో ఒక సమయము, ఒక ప్రదేశము, ఒక విధానము ఉండదు. తల్లి తన పసిపాపపై ప్రేమను...
ధర్మకర్తయే జీవుండు ధనములకును
వానిదే ధనమంతయు ననుసరించు
పాప పుణ్యంబులే ఏది పట్టుకొనడు
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥103॥
తా॥ జీవుడు కేవలము ఒక ధర్మకర్త వంటివాడే. ఈ ధనమంతయును భగవంతుని ఆస్తియే. జీవుడు పోయేటప్పుడు ఈ ధనములో దేనినీ కొనిపోడు. ఈ ధన విషయమున...
కర్మఫలములు తప్పవు కాలునకును,
స్వేచ్ఛతో పాపమునుఁ జేయ శిక్షనొందె,
శివుడ నేనె మార్కండేయు డవతరించె,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥97॥
తా॥ యమునికి కూడ కర్మఫలములు తప్పలేదు. సావిత్రికి స్వతంత్రించి ప్రాణదానము చేసి, మార్కండేయుని విషయమున పట్టుబట్టగా శిక్షింపబడెను. యముని శిక్షించుటకే శివుడనైన నేను మార్కండేయునిగా అవతరించాను. కర్మఫలము ననుభవించ వలయునన్న పట్టుదల ధర్మదేవునికి...
బ్రహ్మశాసన ధర్మంబు భంగపరచి
బ్రహ్మసంప్రీతి రాదు ఏ పద్ధతులను
ధర్మమును తప్ప బ్రహ్మంబు దరికి రాదు
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥91॥
తా॥ ధర్మశాస్త్రము బ్రహ్మము యొక్క శాసనమైన వేదము. మన్వాది ధర్మశాస్త్రములన్నియును వేదోదితములు. అట్టి ధర్మమును తప్పి, బ్రహ్మమును జప, దాన, యజ్ఞాది మార్గములలో దేని చేతనూ ప్రీతినొందించలేము. ధర్మము తప్పినవాని సమీపమునకు...
తప్పు రూపించ నాస్వేచ్ఛ దారి యనును,
జీవుడెప్పుడు నియతుండు దైవవశుడు,
వాని సొత్తు ఈ విశ్వంబు వాడె భర్త,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥84॥
తా॥ దుష్టుని తప్పులను నిరూపించినపుడు, అప్పుడూ తప్పులను అంగీకరించక, నా స్వేచ్ఛ ఇది అనును. కాని జీవుడు దైవశాసితుడు. ఈ విశ్వమంతయును...
పరుల వంచన హింసయు నరక గతులు,
ఇచట వంచింపబడుదువు హింస నచట
పొందెదవు, వాటి వర్జింప పుణ్య సుఖము,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥79॥
తా॥ ఇతరులను మోసగించుట, ఇతరులను హింసించుట నరకానికి మార్గములు. ప్రతిఫలముగా ఇచట భగవంతుని చేత...
నాల్గు వర్ణాశ్రమాలకు నడిమిబొడ్డు
బ్రహ్మమునుజేర నాలుగుపథము లొప్పు
ఈర్ష్యతో నడ్డదారుల నేగతరమె?
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥73॥
తా॥ నాలుగు కులాలకు, నాలుగు ఆశ్రమాలకు, వారి వారి అనుకూలతను బట్టి బ్రహ్మము అను కూడలికి చేరుటకు...
పిచ్చి బిచ్చగానిగ నేను వచ్చుచుందు
నాకు పెట్టిన భిక్ష అనంతమగును
అతడు ప్రతి జన్మ నన్నంబు నందుకొనును
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥67॥
తా॥ పిచ్చివాడగు బిచ్చగానిగా నేను వచ్చుచుందును. నాకు పెట్టిన భిక్ష అనంతమగును. దాని ఫలముగా...
మేటి కర్తవ్యముల జేసి మిగులు సమయ
మందు భగవదర్చన సేయ నరయు సిద్ధి,
అపుడు వ్యర్థవ్యసనముల నరిగిచెడును
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥61॥
తా॥ కర్తవ్యములు చేసుకుంటూ, ఖాళీగా ఉన్న సమయమునందు భగవంతుని అర్చించిన చాలును. తప్పక సిద్ధిని పొందును. ఖాళీగా ఉన్న సమయము లందు...
పరుల సొత్తు కాజేసి లాభంబు దలచు
కాని మూలధనములును కరిగిపోవు,
మోసగించిన వాడెపో మూర్ఖుడయ్యె,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥55॥
తా॥ పరుల ధనములను అపహరించి, తాను లాభమును పొందెనని మూర్ఖుడు తలచును, వాడు మూర్ఖుడు. ఏలననగా ఆ పరుల ధనము వాని మూలధనమును కూడ నాశనము చేయును. కాన అట్టివాడు బుద్ధిమంతుడు కాడు. సత్యము తెలియని...
పులుపు కారము లుప్పులు తిలభవములు
రోగదములు, తగ్గించ నారోగ్యవృద్ధి,
జిహ్వగుహ్య చాపల్యము చెడుపథములు,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥49॥
తా॥ పులుపు, కారము, ఉప్పు, నూనెలు మొదలగు రోగకరములగు పదార్థముల నెంత తగ్గించిన అంత ఆరోగ్యము వృద్ధియగును. దాని వలన దైవానుగ్రహసాధన చక్కగా జరుగును. మానవుని చెడగొట్టు దారులు రెండే రెండు. ఒకటి జిహ్వచాపల్యము రెండవది గుహ్యచాపల్యము...
అష్టసిద్ధుల కీర్తిని ఆశపడుట
స్వామి పదవిని కోరుట సంతసంబె?
భక్తకోటుల దుఃఖాను భవము తెలియ,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥43॥
తా॥ అష్టసిద్ధులనూ, కీర్తిని ఆశించుట, స్వామి పదవిని కోరుటయే. ఆ పదవి ఆనందకరమని అనుకొనుచున్నాడు. కానీ, స్వామి నిత్యమూ భక్తకోటుల...
ఆలయంబుల వ్యాపార మధికమయ్యె
యోగియే నిలువండట, యోగిరాజు
నిలుచునే అన్య దేశాల నిలుచుగాని,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥37॥
తా॥ దేవాలయములందు వ్యాపారము ఎక్కువైనది. అట్టి చోటులందు యోగియే నిలువజాలడు. ఇక యోగేశ్వరుడు...
ధర్మ రక్షణము, అధర్మ దండనములు
జ్ఞాన బోధ యథాశక్తి మానవలదు,
స్వామి సహకారమున స్వామి సంతసించు,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥31॥
తా॥ యథాశక్తిగా ధర్మ రక్షణ, అధర్మ ఖండనము, జ్ఞానబోధలను చేయుము. నా కెందుకని ఉపేక్షించకుము. ఈ మూడు స్వామి చేసే కార్యాలు. నీవునూ చేసినచో స్వామికి సహకరింతువు. దానిచేత స్వామి ఎంతయో సంతసించును. ఆ పనులు చేయుట చేత నీకు నిజముగా...
గుణము పూజ్యతా హేతువు కులముకాదు
రావణ ఖలుండు వధ్యుడే బ్రాహ్మణుండు,
రాముడ బ్రాహ్మణుండు నారాధ్యుడగును,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥25॥
తా॥ గుణము వలన పూజ కలుగును కాని కులము వలన కాదు. రావణుడు బ్రాహ్మణుడైనా దుర్గుణుడైనందున...
రూపవంతుడు ఆత్మ నిరూపణమట
నేను నీవను భావి సన్నిధిని చెప్పు
ఇటు మహావాక్య తాత్పర్య మెరుగవలయు
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥19॥
తా॥ ఒక రూపము కల వ్యక్తి, ప్రశస్తమైన వేదాంత జ్ఞానము అతిశయముగా కలవాడు, కాన ‘అయ మాత్మా బ్రహ్మ’ ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అనియు, అతి సమీప భవిష్యత్తులో నేను, నీవూ బ్రహ్మము కావలయునని కోరికను సూచించు వర్తమాన ధాతువులతో...
మూడు ముక్కలు కాలేదు, మూడు కాదు,
మూడు మూర్తులలోనున్న, మూర్తి ఒకడె,
మాయ చలన చిత్రములోన మనిషి ఒకడె,
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥13॥
తా॥ బ్రహ్మము మూడు ముక్కలు కాలేదు. మూడు బ్రహ్మములూ లేవు. త్రిమూర్తులలోనున్నది ఒక్క మూర్తియే. ఆయన మాయ ఇది. సినిమాలో ఒకే నటుడు ఒకే సమయములో మూడు పాత్రలలోను, ఒకే నటుడు తన ముఖమునే మూడు ముఖాలతోనున్నట్లు...
బ్రహ్మమును గుర్తుపట్టియు, బ్రహ్మలబ్ధి
పథము తెలిసినవాడె పో బ్రాహ్మణుండు,
విప్రసుతుడైన మాత్రాన విప్రుడగునె?
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥7॥
తా॥ బ్రహ్మమును గుర్తుపట్టి, బ్రహ్మమును పొందు మార్గమును తెలిసినవాడే బ్రాహ్మణుడు. అంతే తప్ప బ్రాహ్మణ పుత్రుడైనంత మాత్రాన బ్రాహ్మణుడగునా? కాడు కాడు...
సృష్టికర్తను భర్తను సృష్టిహర్త
నేనె నా మూడు ముఖము లీ నిజము తెలుపు
ఒక్కడనె కాన బ్రహ్మంబు ఒక్కటియగు
మరచిపోకుము దత్తుని మంచిమాట. ॥1॥
తా॥ ఈ సృష్టికి కర్తను, భర్తను, హర్తను నేనే. ఈ సత్యమును నా ఈ మూడు ముఖములు చాటుచున్నవి. నేను ఒక్కడినే. ముగ్గురు కాను. అనగా బ్రహ్మము ఒక్కటేనని తాత్పర్యము...