భక్తులకు మనవి
మహిమ యమున
పరమపూజ్య శ్రీశ్రీశ్రీ దత్తస్వామి వారు దత్తభక్తుల జీవితాలలో చేసిన కొన్ని అద్భుతమైన మహిమల సంగ్రహము.
(వెబ్ సైట్ లో పోష్టు చేయబడుతున్న ఈ భాగములన్నియు శ్రీ చిలుకూరి బాలకృష్ణమూర్తి గారు మరియు ఇతర భక్తులచే సంకలనము చేయబడి, ప్రచురితమైన ‘మహిమయమున’ అను గ్రంథము నుండి గ్రహించబడినవి.)
మనవి
ప్రొ॥ డా॥ ౙన్నాభట్ల వేణుగోపాల కృష్ణమూర్తి గారినే ‘స్వామి’ లేక ‘దత్తస్వామి’ అని భక్తులందరూ పిలుస్తారు. స్వామి సాక్షాత్తు శ్రీదత్తాత్రేయుడని భక్తుల ప్రగాఢ విశ్వాసము. స్వామి మహిమలు అనంతాలు. 'నాన్తోఽస్తి మమ దివ్యానామ్' అని గదా గీత! మచ్చుకు కొన్ని మాత్రమే వ్రాసినాము ఈ మహిమ యమునలో...(Click here to read)
“అవిశ్వాసులకు విశ్వాసాన్ని ‘మహిమ యమున’ ద్వారా, భక్తి దరిద్రులకు భక్తిని ‘భక్తిగంగ’ ద్వారా, జ్ఞానదరిద్రులకు జ్ఞానాన్ని ‘జ్ఞానసరస్వతి’ ద్వారా దానం చేయుట చేత దత్తప్రీతిని పొందండి. దానమే దత్తస్వరూపము" అంటారు స్వామి. ఇంక “జ్ఞాన సరస్వతి (Click here)” పేరు కల ఈ మహాగ్రంథము ముద్రణము కావాలి. ఇప్పటికి చాల దత్తగ్రంథములను ముద్రణము చేసి ప్రచారమును చేసినాము. "నా కార్యము, జ్ఞానప్రచారము చేసి జీవులనుద్ధరించుట. నన్ను వ్యక్తిగతముగా సేవించుట కన్నను, నా కార్యమున సహకరించి సేవించువాడు నాకు ఎంతో సంతోషమును కలుగచేయును” అంటారు స్వామి. ఎవరికి ఎట్లు అనుకూలమో అట్లే ఈ దత్తసేవలో పాల్గొనవచ్చును. శ్రీ కోనేరు సత్యనారాయణగారు ముద్రణమునకు కంప్యూటర్ ను సమర్పించగా, శ్రీ భీమశంకరంగారు 50 వేలు, శ్రీ చంద్రశేఖర్, గాయత్రీ దంపతులు 55 వేలు, శ్రీ అజయ్ గారు 60 వేలు దానము చేసినారు. శ్రీ శేషాద్రిగారు ‘శ్రీ దత్తవాణి’ మాగజైన్ ను నడుపుటకు నడుము కట్టినారు. శ్రీ శర్మగారు స్వామి భజనలను క్యాసెట్లు చేసి భక్తులకు ఇచ్చుచున్నారు. శ్రీ బాలకృష్ణమూర్తి దంపతులు మరియు కుటుంబ సభ్యులు ఈ ప్రచార సేవలో మూలస్తంభముగా నిలచి కావలసిన ద్రవ్యమంతయూ సమకూరుస్తూ సేవ చేసినారు. ఇంకా ఎందరో దత్తభక్తులు యథాశక్తి గురుదక్షిణలనిచ్చి, యీ గ్రంథములను యోగ్యులకు అందచేసి వారిచ్చు గురుదక్షిణలను స్వీకరించి ఈ దత్తకార్యమగు జ్ఞాన-భక్తి యజ్ఞములలో సమిధలుగా మారి త్యాగముతో శ్రీదత్తుని చేరుచున్నారు. "త్యాగేనైకే అమృతత్వ మానశుః" - అని శ్రుతి. స్వామికార్యములో స్వార్థరహితమైన సేవచేసి హనుమంతుడు అగ్రగణ్యుడైనాడు. శంకర, రామానుజ, మధ్వ, మీరాదులు జ్ఞాన-భక్తి ప్రచార సేవతోనే కైవల్యమును పొందినారు. ప్రచార సేవాకర్మ చేయ అవకాశములేని వారు వారి కర్మఫలత్యాగముతో (అనగా వారి సంపాదన నుండి దానము చేయుట) ముక్తిని పొందవచ్చుననే గీతావచనమును ఉటంకిస్తూ "కర్మఫలత్యాగః" అని అంటారు స్వామి.
కావున దత్తసేవలో పాల్గొని దత్తకైవల్యాన్ని పొందగోరు వారికి మా దత్త ఆహ్వానమిదే!
“నా కార్యమున పాల్గొను సేవ సాధన యొక్క ఫలస్వరూపము. అది నా అనుగ్రహమున్ననే జీవునకు లభించును” అని స్వామి వాణి.
దత్త భక్తబృందము.
ముద్రణ తేదీ - 19 December 2002