దత్త తికమక చూడండీ |
పిచ్చివాడని తెలియండీ || (పల్లవి)
దుర్వాసశాప హతుడై తిరుగును - ఉన్మత్తుండై మధుమత్తుండై |
ధర్మము చెప్పు నధర్మము చేయుచు - ఙ్ఞానము చెప్పును జడునిగ తిరుగుచు ||
శ్మశాన వాసియు ప్రాసాదవాసి - ధ్యాననిష్ఠుడు తరుణీరతుడు |
యోగోపదేష్ట భోగలాలసుదు - దిగంబరుడును పీతాంబరుడు ||
పాదదాసియై పద్మయుండగ - బిచ్చమెత్తును పిసినారివాడు |
గంగాస్నానము సంధ్యానిష్ఠయు - వేశ్యావాటికల తిరుగుచుండును ||
బ్రహ్మర్షివరులె పదములబట్టగ - నిత్యముకాంతా మధుసంగుండు |
గీతను చెప్పును మద్యము త్రాగును - యతులకు గురువై గోపీ జారుడు ||
పిచ్చివానికి చేతిరాయిగ - అష్ట సిద్ధులు అమరియున్నవి |
పెద్దవారలె దత్తుని జోలికి - పోకయుండిరి బుద్ధితెచ్చుకొని |
బ్రహ్మమాతడె నిస్సంశయమ్ము - ఏమి లాభము? పిచ్చివాడతడు ||