home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

షిరిడీ కుక్కను చూడండీ


షిరిడీ కుక్కను చూడండీ ! సద్గురువుగ వచ్చాడండీ !  (పల్లవి)

దూరదూరముగ నుండండీ - పిచ్చికుక్క ఇది పోపొండీ !
కరచిన వెంటనె మీకండీ - బ్రహ్మపిచ్చి కలిగేనండీ ||

ఆపిచ్చి నయము కాదండీ - శాశ్వత మోక్షమె గతియండీ |
జీవికి యాతన నిస్తాను - అంత్య కాలమున వస్తాను ||

కాశీపురమున ఉంటాను - కాలభైరవుడు అంటారు |
అట్టహాసమును చేసేను - బ్రహ్మాండములే పగిలేను ||

కసాయి కఠినుడనేనండీ - దాక్షిణ్యమనుట  లేదండీ |
కర్మ ఫలములనే ఇస్తాను - ధర్మ రక్షణను చేస్తాను ||

నాలుగు దిక్కుల నేనుంటా - ధర్మధేనువును రక్షిస్తా |
వీరభద్రునిగ ఆనాడు - దక్ష శీర్షమును తుంచాను ||

పాశుపతాస్త్రము నేనేను - పార్ధుని రక్షణ చేశాను |
శూలము చక్రము నేనేను - దత్తుని కరముల వెలిగేను ||

శంఖము డమరువు నేనేను - నాధ్వని వేదము వింటేను ||
కుండీ మాలలు జపములు నేను - సాధన మార్గము సూచిస్తాను |

బ్రాహ్మణోஉహమపి చండాలోஉహం - సాధుధేనురపి క్రూరశ్వాஉహమ్‌ |
శ్రీదత్తోஉహం  గురుదత్తోஉహం - ప్రభు దత్తోஉహం తవ దత్తోஉహమ్‌ ||

 
 whatsnewContactSearch