home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

కృష్ణుని విడుమో నళినీ!


కృష్ణుని విడుమో నళినీ!
నయవంచకుడీ కలిని (పల్లవి)

మాటల గారడి మిన్న- అష్టసిద్ధులవి సున్న |
కల్లబొల్లి కృతి వ్రాసితినీ - పిచ్చి భక్తులను పట్టితినీ ||

సేవా సుఖముల తేలితిని - మాయమాటలను పలికితినీ |
ఇద్దరు భార్యలు పంచుకొనన్ - మూడవ భార్యను ముంచితినీ ||

దత్తుడెక్కడ ఆ యోగిరాజు! - కృష్ణుడెక్కడ! ఈ భోగిరాజు! |
మాయ మాటలె నా మురళి! - సన్న నవ్వులె నా సరళి! ||

యోగమార్గము నా ఉపదేశము! - భోగ మార్గము నా ఆచరణము! |
సంధ్యనువార్చని విప్రుడను! - ధనమును దాచెడి లుబ్ధుడను ! ||

బిచ్చగానికి బిచ్చము వేయను! - అన్ని గృహముల అతిధిని నేను! |
సత్యము చెప్పిన వినవేలా! - మాయ మాటలకు పొంగెదవేలా! ||

 
 whatsnewContactSearch