home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

సాక్షాత్తు దత్తుడు నేను


సాక్షాత్తు దత్తుడు నేను
సద్గురు రాజును నేను
అధమ నరుండను నేను
ఒక్కొక్క జీవునికిట్లు త్రిరూప ధారిని నేను. (పల్లవి)

1.  ఒకరోజు నేను స్వామి - మరుసటి రోజున గురువు |
మూడవ రోజున పాపి - మారుచుండు నిటు రోజు ||

2.  అనుకొనుచుందును రోజు - పాపినటంచును నేను |
పతనము దుఃఖము లేదు - అధమ స్థితిలో నుందు ||

3.  స్వార్ధమునిచ్చిన హరిని - ఈయకున్న కిరిని |
కిరిరూపమునెత్తితిని - నాకిక పతనము లేదు ||

4.  మహిమల జూపిన దత్త - చూపకున్న ఒక దుత్త |
చూపిన గానీ క్షుద్ర - ఇదియే జీవుల ముద్ర ||

5.  అసురులు సిద్ధులఁ జూపె - నటుడు వేషమునుఁ దాల్చు |
అసురుడ నటుడను కాను - ఙ్ఞానము ప్రేమయె గుర్తు ||

6.  మొండితనములకు నిత్తు - సిద్ధుల నసుర సుతులకు |
అవి నా గుర్తులు కావు - ఙ్ఞానముచే తెలియండీ ||

 
 whatsnewContactSearch