home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

వారిజాతమా! నా గీతమును


(శంకరాచార్యునకు శ్రీ దత్త గురువు చేసిన బోధ)


వారిజాతమా! నా గీతమును
ఆలకించుమా సావధానవై ! (పల్లవి)

1.  కాశీ పధిని చండాలునిగ - నాలుగు కుక్కలు వెంబడి పడగ |
నన్ను జూచెను శంకర గురువు - తొలగమని నన్నాదేశించె |
అపుడు పలికితి "ఆచార్యేంద్రా! - పంచభూతములన్ని తనువులు |
చిదాత్మ ఒకటే పలికితి వీవె - ఏది పక్కకు పోవలె? " ననుచు |
బిత్తర పోయెను శంకరుడపుడు - సాష్టాంగముగ పదముల బడియె |
నీవె గురువని నన్ను నుతించె - గురువులకు గురుని నన్ను తెలియుము |
జగద్గురువుకే - ఙ్ఞాన నేత్రము - తెరిపించితిని - తెరఁదీసితిని |
శంకరునికే - మాయఁ గప్పితి - నన్నెవ్వరిల - తెలియగలేరు ||

2.  జీవుడైనా దేవుడైనా కనుల గంతలు కట్టవలెను |
విశ్వనాటక వేదికాస్థలి నియమమిదియే ప్రధమ సూత్రము |
అవతరించును దేవుడెపుడు ప్రతి తరంబున అన్ని చోటుల |
బీదవారలు ఒక్క చోటికి తన్ను చూడగ రాలేరనుచు |
అన్ని గృహముల ఒక్క రూపమె కృష్ణుడుండెను వేరు వేరుగ |
భిన్న రూపములుండ కష్టమే ? ఏక కాలమునందు స్వామికి ||

 
 whatsnewContactSearch