ఎంతోదూరం బ్రహ్మపదం - ఓ జీవా !
ఇంకా ఎంతో దూరం బ్రహ్మపదం (పల్లవి)
కన్నుల చంపుము - చంపుము చెవులను జిహ్వను చంపుము .. వారే శత్రులు-
విషయాకర్షిత మింద్రియసంతతి నాపై మనమును నిలువగ నీయదు ||ఎంతోదూరం ||
నన్ను చేరిడి లక్ష్యము నీకూ, చేసే సాధన దాని విరుద్ధము, మంట జేసెడి
లక్ష్య సాధనకు, నిప్పుల జలము పోసిన రీతిగా ||ఎంతోదూరం ||
ఏది విందువో, ఏది చూతువో ఏది పల్కుదువో, అదియే నీలో
జీర్ణమగును, నీదగు తత్త్వము ఆలోచింపుము, దీనిని చాలును ||ఎంతోదూరం ||
మొహమాటంబను మాటను వదలుము కఠిన మనముతో దీక్షను బట్టుము
చూడకు దేనిని, వినకుము నెవ్వరి పలుకకుమందరి పరిహరించుము ||ఎంతోదూరం ||
పిచ్చివాడవని పలికెడు వారల పిచ్చివారలని తెలియుము మదిలో
వారలె యమపురి కేకలు పెట్టగ, ఇంద్రియనిగ్రహ నిశ్చలబుద్ధిని
నాపైనుంచుము నిమిషనిమిషమును నన్నే చూడుము నన్నే వినుమూ
నన్నే పలుకుము ఇదియే మార్గము ||ఎంతోదూరం ||
జగతిని వదలుట మోక్షము సుమ్మీ నన్నే తలచుట సాధన సుమ్మీ
నన్నే చేరుట కైవల్యంబని పండితులందురు, సత్యంబిదియే ||ఎంతోదూరం ||