ఎక్కడినుండి వచ్చావో !
మరల ఎక్కడికి పోతావో నీకేమి తెలియదురా. జీవా !
ఈ మధ్య క్షణకాలము లోపల మిడిసిపడి ఎగిరెదవేలా? ||ఎక్కడి||
మిద్దెలు మేడలు పుత్రులు బంధులు క్షణమున పటపట తెగిపోతారు. ||ఎక్కడి||
జన్మము నరకము! మరణము నరకము తదుపరి నరకము చెప్పగనేలా? ||ఎక్కడి||
నీ సంగతి తలచిన నాకే జలదరించును మొద్దువలె వుంటావేల ? ||ఎక్కడి||
కరుణాసాగర దత్తుని పాదము గట్టిగ పట్టిన భయపడనేలా ? ||ఎక్కడి||