home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

ఇంద్రాది దేవతలకైన నా మాయ దాటంగ తరమె


ఇంద్రాది దేవతలకైన నా మాయ దాటంగ తరమె ? (పల్లవి)

1.  అవతరించెద ధరణి నెపుడు - భిన్న పాత్రల రసము కొరకు |
మీ తోడ దొంగాట లోన - క్రీడించుచున్నాను నేను ||

2.  పాత్రలో దాగినను నన్ను - నా రూపమును చూచి పట్టు |
మీ తోడ క్రీడించుచున్న - దొంగాట ఇదె పట్టుకొనుడు ||

3.  పాత్ర వేషములోన జగతి - నా సత్య రూపంబు దాగు |
నా రూపమే ఙ్ఞాన ప్రేమ - నా సొమ్ము లష్ట సిద్ధులిల ||

4.  నను పట్టగలవాడు లేడు - నను గట్టు పాశమ్ము ప్రేమ |
ప్రతిఫలాపేక్ష లేకున్న - వానికే దాసుండ నగుదు ||

5.  మోక్ష కామము గూడలేక - నన్నెపుడు సేవించు వాడు |
అద్వైత కైవల్యమునకు - మిన్నయౌ నా స్వామి యతడు ||

6.  నా మహా మాయచే తిరుగు - ఏడేడు లోకాలు ఎపుడు |
ఓ జీవ! నీవెంత తెలిసి - వినయమ్ముతో బ్రతుకు మిలను ||

 
 whatsnewContactSearch