home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

స్మరామితం సదా దత్తం


స్మరామితం,సదా దత్తం

పరమాత్మయైన దత్తభగవానుడిని నేను ఎల్లపుడూ స్మరిస్తాను.

బ్రహ్మ విష్ణుం శంకరం నరావతారమ్||
శ్యామారుణ ధవళ మిశ్రకాంతిం
వేదాంత శాంతిం | ధూతమయా భ్రాంతిమ్||

త్రిమూర్తులైన బ్రహ్మ-విష్ణు-శంకర రూపములు ధరించి, జీవులు సేవించడం కొరకు ప్రతితరంలోనూ మానవ శరీరమునే ఉపాధిగా పొంది నరావతారముగా దిగివచ్చేటటువంటి, నీలము-ఎరుపు-తెలుపు వర్ణముల మిశ్రమమైన శరీరవర్ణముతో చక్కగా ప్రకాశించేటటువంటి, ఆధ్యాత్మిక జ్ఞానముతో శాంతికరమైనటువంటి, జీవులు దాటడానికి అతికష్టమైన ప్రాపంచికమైన భ్రాంతులను విసరికొట్టినటువంటి, పరమాత్మయైన దత్తభగవానుడిని నేను ఎల్లపుడూ స్మరిస్తాను.

బహూజన్మ సాధనైక సాధ్యం |  వేదారాధ్యం | కాలత్రయా బాధ్యమ్
శ్రితధర్మ దేవతా ధేనుం శ్రుతి శునక వృత జానుం
మునిః మనః కమల భానుమ్||

అనేక జన్మలపాటు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటేనే తప్ప జీవులకు సులభంగా దొరకని, ఆధ్యాత్మిక జ్ఞానముతో పరిపుష్టమై వేదములచే సేవింపబడేటటువంటి, భూత-భవిష్యత్-వర్తమాన కాలములకు లోబడక సర్వదా అతీతుడైనటువంటి, ధర్మదేవతయే గోరూపము ధరించి తనను ఆశ్రయించినటువంటి, పవిత్రములైన వేదములే శునకరూపము ధరించి తన పాదములను ఆశ్రయించినటువంటి, ముని జనుల హృదయములనే కమలములను వికసింపచేసే సూర్యుడైనటువంటి పరమాత్మయైన దత్తభగవానుడిని నేను ఎల్లపుడూ స్మరిస్తాను.

 
 whatsnewContactSearch