home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

అనసూయ పుత్ర గురుదత్తా


అనసూయ పుత్ర గురుదత్తా !
అభయంబు నిమ్ము ప్రభుదత్తా ! (పల్లవి)

కమలాయతాక్ష ! శ్రీదత్తా ! కరుణాంతరంగ !  హేదత్తా!
కమనీయ రూప! శ్రీ దత్తా ! కలివాద భంగ!  హేదత్తా!
హృదయాంతరాన ధ్యానిస్తే - వెనువెంట దత్త విభుడొస్తే -
నను బ్రోవమంచు  ఏడిస్తే - గురు సేవ చేయమంటాడు ||

 
 whatsnewContactSearch