home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

అంతర్యామీ ! దత్తాత్రేయా


అంతర్యామీ ! దత్తాత్రేయా ! అరచితినీ ! మొరిగితినీ !
ఎప్పటికప్పుడే నీ పలుకులను ||
అరచి అరచి మొరిగి మొరిగి - నీ పద కమలములనిదే
వ్రాలితినీ అంతర్యామీ || దత్తాత్రేయా || (పల్లవి)

1. మారరు జీవులు మారరు జీవులు - నా వాలము వలె వంకరలు |
క్షణికపు  మార్పులు మరల పాతవె పద్ధతులు - అంతర్యామీ ! దత్తాత్రేయా ||

2. పాపక్షయ సులభ మార్గమును వినరు ఎంత చెప్పిననూ |
వ్యర్ధములగు కష్ట మార్గములనే శ్రమపడి చచ్చెదరు - అంతర్యామీ ! దత్తాత్రేయా ||

3. కృతయుగమంతయు అత్రి తపించిన క్షణ దర్శన మిచ్చితివి |
పిలువకయె వచ్చి నాతోనెప్పుడు ముచ్చటింతువు నా ప్ర్రాణ సఖా |
అంతర్యామీ ! దత్తాత్రేయా ||

4. నా తోడ నడచి  నాతో నిత్యము ఐక్యము చెందితివి ! |
దేవతలకును ఋషులకును అబ్బని భాగ్యము నా కిచ్చితివి |
అంతర్యామీ ! దత్తాత్రేయా ||

5. హంసను పంపుము గరుడుని పంపుము నందిని పంపుము ఈ లోకమునకు |
నారద గణపతి హనుమదాదులు పరమ పావనులు కలరు గదా నీ సేవలకు |
అంతర్యామీ ! దత్తాత్రేయా ||

6. చాలు చాలునిక కొంత విశ్రాంతి నొసగుము స్వామీ |
నీ రూపములో ఇక ఐక్యముగానీ నా రూపము ! అంతర్యామీ ! దత్తాత్రేయా ||

 
 whatsnewContactSearch