home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

దత్తగురువుకు దండాలు


దత్తగురువుకు దండాలు
దత్త ప్రభువుకు జేజేలు || (పల్లవి)

1. సృష్టి కర్తకు - సృష్టి భర్తకు - సృష్టి హర్తకు - పరబ్రహ్మకు ||
2. వాణి భర్తయు - లక్ష్మీధవుడును - గౌరీ పతియగు - మూలవిరాట్టుకు ||
3. ఆ త్రిమూర్తులే - తన వేషములై - విశ్వమంతయును - తానొకడేయగు ||
4. శంఖ చక్రముల ఢమరు శూలముల కుండీ మాలల పట్టిన వటువుకు ||
5. అత్రిపుత్రునకు - అనసూయ పట్టికి - అనఘా ప్రియునకు - ఆనందాత్మకు ||
6. వేదపురుషులే - శునకాకృతులతో - పదముల, వ్రాలిన - పావన మూర్తికి ||
7. దర్మదేవతయే - పాహిపాహియని - గోవుగ చేరిన - విశ్వపాలునకు ||
8. అష్ట సిద్ధులను - వేయి చేతులను - కార్త వీర్యునకు - ఇచ్చిన స్వామికి ||
9. విష్ణు దత్త  పితృ శ్రార్ధము నందున - భోక్తగ వచ్చిన - మంత్ర బ్రాహ్మణునకు ||
10. వేదశాస్త్రముల - సారము నంతయు - పిండియిచ్చిన ఙ్ఞానసాగరునకు ||
11. కనుసైగలతో - భోగ మోక్షముల - భక్తులకిచ్చెడి - భగవంతునకు ||
12. షోడశ కళలతో - పూర్ణిమ వెలుగుల - పదునారేడుల - ముగ్ధ బాలునకు ||
13. చిలిపి చేష్టలతో - విశ్వనాటకమును - రక్తికి చేర్చెడి - జగన్మోహనునకు ||
14. పరశు రామునకె - పరమాచార్యుడు - స్కంద గురువుకె-ఆధ్యాత్మిక గురువగు ||
15. సృష్టి స్ధితి లయ - కారణ బ్రహ్మము - మూడు ముఖముల - తానని తెల్పిన ||
16. వేదము చెప్పిన - నిర్వచనమునకు - పూర్ణసమన్వయ - మగు బ్రహ్మమునకు ||

 
 whatsnewContactSearch