home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

దిగి దిగి వస్తున్నాడు


దిగి దిగి వస్తున్నాడు !
దత్తుడు దిగి దిగి వస్తున్నాడు || (పల్లవి)

1. మునులను వదలి గొల్లల వద్దకు - ఆశ్రమము వీడి రేపల్లె లోకి |
కాషాయము వీడి జిలుగు గుడ్డలతో - దండము విడచి వేణువు బట్టి ||

2. వేదము వదలి పాటల పాడుచు - రుద్రాక్షల వీడి ముత్యాల సరముల |
త్యాగము విడచి భోగముతోడ - యోగి రాజయిన ప్రణయలోలుడిగా ||

3. పామరులనైన ఉద్ధరించుటకు - పామర వేషము పామర భాషతో |
శాస్త్రాల వదలి శ్రుతి పండితుడు - కొంటె వాడగు గొల్ల వానిగ ||

4. బ్రహ్మర్షులకును అందనట్టిది - బ్రహ్మానందము నీయ పామరులకి |
ఙ్ఞాన సారమే భక్తి యోగమని - తెలియ చెప్పుటకు గోప వేషమున ||

 
 whatsnewContactSearch