home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

బ్రహ్మము నేనేరా పరబ్రహ్మము నేనేరా


బ్రహ్మము నేనేరా
పరబ్రహ్మము నేనేరా ఓ జీవా
పరాత్పర బ్రహ్మమూ నేనేరా.

నన్ను చేరిన - చేరవలసిన - గమ్యము లేదిక
లేదిక - లేదిక - లేదిక - లేదిక   -బ్రహ్మము

సృష్టి కర్తను - సృష్టి భర్తను - సృష్టి హర్తను
సృష్టి అంటని - బుద్ధికి చిక్కని - భక్తి గమ్యుడ     -బ్రహ్మము

ఎవ్వడు యముడు - ఎవ్వడింద్రుడు - నా భావరూపులే
నన్ను మించిన - ధర్మాధర్మము - లెచ్చట నున్నవి ..    -బ్రహ్మము

నీ ఇంటిలోనే - నే కొలువుదీరి - ఉండియుంటిని
పిచ్చివాడా! నీ కాళ్ళతిప్పట - ఎందుకు ఎందుకు ? ..    -బ్రహ్మము

నేను తలచిన - చిటిక లోపల - అందుకుందువు
యుగయుగ తపములు - చేసిన అందని బ్రహ్మపదవిని ..   -బ్రహ్మము

నాపై దృష్టిని స్ధిరముగ నిల్పుము - తిప్పకు పక్కకు
నాదు నామము - నీదు ఊపిరి - శబ్దము చేయును ..   -బ్రహ్మము

నా ఆజ్ఞలేకయే - ఎవ్వడేమియు - నీకీయలేడు
నన్నర్ధించియే - వరముల నిత్తురు - దేవదేవతలు ..   -బ్రహ్మము

నన్ను తెలిసిన - వాడు ఎవ్వడు - అన్యుల చూడడు
అన్ని చివరల - చిట్టచివరి - వాడను నేనే ..  -బ్రహ్మము

నీపై దయతో - స్వయముగ వచ్చితి - నీవు తరించగ
కంటిమాయ - తెరలను త్రోసి - గుర్తు పట్టుము ..   -బ్రహ్మము

ఋషులును దేవులు - గుర్తు తెలియక - వెతుకుచుండగ
నీదు ఇంట - నీదు వెంట - నీదు జంట - ఉంటినే ..   -బ్రహ్మము

 
 whatsnewContactSearch