home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

ఏడవ కొండనె నీవుండినావు


(షట్చక్రములను గురించి స్వామి ఎంత విపులముగా వివరించారో విని తరింతుము గాక.)

ఏడవ కొండనె నీవుండినావు
మొదటి కొండనె ఎక్కగ లేదు
ఏదు కొండలను ఎప్పుడెక్కెదను ?
నా వల్ల కాదింక నారాయణా
నీ కరుణ లేక నేనెక్కలేను  (పల్లవి)

1. మొదటి కొండయె మూలాధారము - భూమి తత్త్వమిది మాతృస్ధానము |
రెండవ కొండయె మణిపూరమగు - జల తత్త్వంబది జనక స్ధానము ||

2. పృధివీ జలములు కలసిన పుట్టును - సర్వ వృక్ష తతి జీవోద్భవమది |
ఆకాశ మేఘ సంభవ జలమగు - భూమ్యాకాశము లంబయు తండ్రియు ||

3. మూడవ కొండయె భర్తృ స్ధానము - భార్యా స్ధానము  స్త్రీ  పురుషులకిల |
అగ్ని తత్త్వమది స్వాధిష్టానము - కామ క్రీడలు వేడి వల్లనగు ||

4. నాల్గవ కొండయె సంతానమగును - వాయు తత్త్వమది అనాహతము |
హృదయమునందున  ప్రేమావేశము - సంతాన బంధ మచ్ఛేద్యమగుట ||

5. ఐదవ కొండయె నర గురు బంధము - ఆకాశపధము విశుద్ధ చక్రము |
కంఠ స్ధానము గురువు పల్కునిల - గళమున మాటల గారడి చేయును ||

6. ఆరవ కొండయె నానా దేవులు - మనో రూపులుగ ఆఙ్ఞాచక్రము |
దత్త వేషములు వరములనిత్తురు - వేషి దత్తుడు జారిపోవును ||

7. ఏడవ కొండయె సహస్రారమగు - బుద్ధి ఙ్ఞానము శీర్షమునందున |
దిగంబరుండగు దత్తుడుండునట - దిగంబరుండన నిజ వేషధారి ||

8. కుండలినిని నేను జీవతత్త్వమగు - చిజ్జడమిశ్రమ శక్తి తరంగము |
అనఘయు మధుమతి దత్త ప్రేయసి - సర్వ జీవులును కుండలిని లేను ||

9. ఆరు కొండలను వంకర గతితో - దాటి పోవవలె మాయా చేష్టల |
మాయా బంధము లివియె చక్రములుగ - ముల్లు తీయవలె ముల్లు సాధనము ||

10. మాయాకర్షణ బంధచక్రముల - దాటి మాయతో నిన్ను చేరవలె |
యోగశాస్త్రమన ఇదె తాత్పర్యము - బొమ్మ చక్రములఁ దలతురు మూఢులు ||

 
 whatsnewContactSearch