home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

త్యజరే టీవీం త్యజరే టీవీం


టీవీ వ్యసనాలలో అగ్రగణ్య. దానిని సన్యసించమని సాధకులకు స్వామి బోధ.


త్యజరే టీవీం త్యజరే టీవీం - టీవీం త్యజరే మూఢమతే || (పల్లవి)

ఎదురుగ కాలుడు కాలపాశమును - గిరగిర త్రిప్పుచు నిలచి యుండగా |
టీవీ దృశ్యములేవియు నవి నిను - రక్షింపనేర వని తెలియుమురా ||

కాలము శక్తియు పరిమితములుగద - వ్యర్ధముచేతువు వాటిని మూఢా |
పన్నీరములను బూడిదఁ బోసిన - చివరి క్షణమున విలపింతువురా ||

ఎంతో శ్రద్ధగ శ్వాసను బిగించి - టీవీ దృశ్యము చూతువు జీవా ! |
ఆ శ్రద్ధలోన సహస్ర భాగము - దత్తుని పై నిలపిన చాలునురా ||

నిన్నుద్ధరించ శ్రీ గురు దత్తుడు - నరావతారమునెత్తియు భువిలో |
సంచరించునిదె పదముల పట్టుము - టీవీని బద్దలు చేయుము జీవా |

నీ తపమును భంగము చేయగనిదె - అప్సరసలందరును గుమికూడియె |
టీవీ రూపము తాల్చిరి వలయై - నిను పట్టిరిట బయటకు రారా ||

కలి పురుర్షుని ధర్మ పత్ని టీవీయె - నీ శక్తి  పీల్చి పిప్పిని చేయును |
కాలము చంపును నిన్ను చంపునది - మానవ జీవిత మత్యల్పమురా ||

 
 whatsnewContactSearch