home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

ఇతడే దత్త గురుడు - పరాత్పరుడు


ఇతడే దత్త గురుడు - పరాత్పరుడు - నరవరుడు |
మన దేహముల-ఘన మోహముల - సందేహములెపుడు || (పల్లవి)

1. చిలికె వేదమును - పలికె గీతలను - ఒలికె భజనలును |
చూపె మహిమల - చేసె బోధల - బ్రోచె భక్తుల ||

2. మాయగంతలు  - త్రోసి కంతల - కనుడు వింతల |
సూత్రధారియౌ అత్రి పుత్రుడే  పాత్రధారియగు ||

3. అవతరించును - భువిచరించును మదిహరించును |
పాత్రోచితపు జీవవాక్కుల పలుకుచుండును ||

4. మాయమాటల మాయ చేష్టల నటనలోలుడు |
భక్తులకైన కనులఁ గప్పును మహా మాయను ||

5. ఈ చరాచర సృష్టి అంతయు వీని ఆటకే |
ఆడుచుందురు జీవులెందరు ఆట బొమ్మలై  ||

6. వేద తైలపు ఙ్ఞాన దీపము చూపునెప్పుడు |
భక్తి పధమున ఊతమిచ్చును నడక నేర్పును ||

 

 
 whatsnewContactSearch