home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

అందరాని ఆ బ్రహ్మ మేలనో


అందరాని ఆ బ్రహ్మ మేలనో
పొందలేని ఆ ముక్తి యేలనో || (పల్లవి)

మానవాకృతిన్ దాల్చు బ్రహ్మమే - వానిచేరుటే బ్రహ్మ యోగమౌ |
వానిసేవలో నిత్య మోదమే - సత్య మోక్షమౌ ఇచట ఇప్పుడే   |
అంది వచ్చిన బ్రహ్మమిదిగదా - మూఢమానవా! వదలబోకుమా |
సంశయంబుతో కాలమరుగగా - చిట్టచివరలో మొత్తుకొందువు |
సద్వినోదియై జగముచేసెగా - సాక్షి మాత్రిడై చూచి తుష్టుడై |
తృప్తిచెందకే వేషధారియై - పాత్రలీనుడై అవతరించెడిలన్  |
సూత్రధారియే పాత్రధారియై - మోజు తీరగా ఇలనటించెడిన్ |
అష్ట సిద్ధులున్ వాని సొమ్ములే - ఙ్ఞానప్రేమలె వాని తత్త్వమౌ |
తత్త్వ వేత్తకే గుర్తు పట్టగా - సాధ్యమౌనుగా ఙ్ఞాని అతడే |
సిద్ధి సొమ్ములన్ చూచి పామరుల్ - రాజు వేషినే రాజు అందురు |
దీర్ఘ నిద్రనే - మరణమందురు - అచట ఏమియున్ లేదు లేదుగా |
గుణము సృష్టియౌ బ్రహ్మద్రవ్యము - గుణమునైల్యమౌ కలువద్రవ్యము |
ద్రవ్యరేణువే గుణముగానగున్ - రేణువున్నను  లేనిరీతియే |
ఊహమాత్రమే గుణము సృష్టిగా నిర్గుణుండనన్ సృష్ట్యతీతుడౌ |
సృష్టి పూర్వుడౌ బ్రహ్మదత్తుడు - సృష్టి పోవగా రుద్ర దత్తుడున్ |
సృష్ట్యతీతులౌ నిర్గుణాత్మలౌ - బ్రహ్మ నిర్గుణం బన్నవారలే |
సగుణమన్నచో సృష్టియుక్తిడౌ - విష్ణుదత్తుడే వర్తమానుడు |
ఈ త్రిమూర్తులున్ కర్మ వేషముల్ - దత్తుడొక్కడే నటుడు సత్యము |
సగుణనిర్గుణ బ్రహ్మ మొక్కటే - కిరణమాత్రమే గుణము విశ్వము |
కోటి సూర్యులౌ దత్తదేవుని - చర్మ చక్షువుల్ చూడలేవుగా |
యోగిరాజగు స్వస్వరూపమున్ - దివ్య నేత్రమే చూడగల్గును |
స్పర్శ దర్శన భాషణంబులన్ - నరులకీయగా నరుని ముసుగులో |
అవతరించుగా నతడే దత్తుడు - విద్యుదాత్మకంబైన తీగయే |
తీగె తాకగా  ‘షాకు’ కొట్టును - తీగె  విద్యుదద్వైతమాతడే |
జీవులందరున్ సృష్టి భాగముల్ - పరా ప్రకృతియే ఉత్త తీగెలే |
అవతరించుచో ఆశ్రయించుగా - పురుష దత్తుడున్ ప్రకృతి రూపమున్ |
అవతరించిన నర శరీరమే - నరుల ముక్తికై ఏకమార్గము |

 
 whatsnewContactSearch