home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

శ్రీ దత్త గద్య ప్రార్ధన


హే శ్రీ దత్త! హే గురుదత్త! హే ప్రభుదత్త!

1. అస్య విశ్వస్య సృష్టి స్థితి లయహేతు స్త్రిముఖై స్త్వమేక రూప ఏవ
పరబ్రహ్మ వేదోక్త లక్షణద్వయ నిర్వచనాత్. త్వమేవ సర్వ
దేవతా దేవ వేషస్ద శైలూషః ఇదం విశ్వమపి విశ్వరూపాఖ్యం
తవ వేషమాత్రమేవ. అవతరసిచ తత్తత్సాధక స్థాయి భేద
మనుసృత్యయుగపదనేకరూపధారీ తైర్మిలసి చ తాదృశోభూత్వా తానుద్ధరసి చ
జ్ఞానబోధై స్సర్వ జీవానా మేకోద్దార కోభవానే వహి

2. త్వదేక ప్రేమరూపేభ్యో నిష్కామసేవ కేభ్య సర్వందదాసి
చరమ పదం చ తేషాం దాసోభూత్వాయదుత్తరం
కైవల్యాదపి. అచ్ఛిన్నస్త్రిధాఛిన్న ఇవదృశ్యసేత్వత్త ఏవ
ఛిన్నం దారిద్య్రం ఛిన్నం దుఃఖం ఛిన్న మజ్ఞానం ఛిన్నం సర్వ
బన్ద కారణం చ స్వార్ధ తత్త్వమ్.

3. త్వమేక ఏవ జ్ఞాన దాన ధైర్య వీర్య తేజో లావణ్యౌదార్య
త్యాగరాగ సౌందర్య సౌరభ్య సౌజన్య సౌలభ్య కారుణ్య తారుణ్య
సౌహార్ద సౌశీలాద్యపార కల్యాణగుణ రత్నపారావారః త్వయాஉஉ
కృష్ణోஉహంత్వాంసేవే, న కాప్యత్ర ప్రతిఫలాపేక్షా త్వామేవ నిత్యం
నమామి స్మరామి గాయామి పూజయామి ధ్యాయామి.

అర్ధము:- ఓ శ్రీ దత్తా! ఓ గురుదత్తా! ఓ ప్రభుదత్తా!

1. వేదములలో చెప్పబడిన రెండు లక్షణములుగల పరబ్రహ్మ నిర్వచనము ననుసరించి ఈ విశ్వమునకు సృష్టి, స్థితి లయములను నీ మూడు ముఖములతో చేయుటవలన, మరియును నీవు ఒక్కడవే అగుటవలన వేదోక్తమైన పరబ్రహ్మము నీవే. సర్వదేవతలు, సర్వదేవులు, నీవేషములే. నీవు యీ వేషములలో నున్న నటుడవు. ఈ విశ్వము కూడ, విశ్వరూపుడను నీ దేవతా వేషమే. ఆయా సాధకుల స్థాయి భేదము ననుసరించి వారి వారి స్థాయికి దిగి, ఒకే సమయమున అనేకరూపములతో అనేకావతారములుగ వచ్చి, వారివారితో వారివలె నటించుచు వారితో కలిసియున్నావు. వారికి జ్ఞాన బోధలను చేసివారిని ఉద్ధరించుచున్నావు. సర్వజీవులను ఉద్ధరించగల ఏకోద్ధారకుడవు నీవే కదా.

2. నీయందే ప్రేమ గలిగి, ఏ కోరిక లేకుండా, నీ సేవ చేయు నీ సేవకులకు, చరమ పరమపదాన్నియిచ్చుటకు, నీవు వారి దాసుడవైనావు. ఈ ముక్తి కైవల్యముకన్నను గొప్పది. నీవు నిజముగ అచ్ఛిన్నుడవు కానీ త్రిమూర్తులుగా ఛిన్నుడవైనట్లు కనపడుచున్నవు. నీవలన దారిద్య్రము ఛిన్నమగును, దుఃఖము ఛిన్నమగును. అజ్ఞానము ఛిన్నమగును. సర్వబంధములకు కారణమైన స్వార్ధము ఛిన్నమగును.

3. నీవు ఒక్కడవే జ్ఞాన, దాన, ధైర్య, వీర్య, తేజస్సు, లావణ్యము, ఔదార్యము, త్యాగము, రాగము, సౌందర్యము, సుగంధము, సౌజన్యము, సౌలభ్యము (సులభముగా లభించుట), కారుణ్యము, తారుణ్యము (యౌవనము), సహృదయము, సౌశీల్యము మొ|| అపారములగు కల్యాణ గుణములను రత్నములుగల సముద్రుడవు. నేను కేవలము నీ గుణములచేత చేత ఆకర్షింపబడి నిన్ను సేవించుచున్నానే తప్ప, నాకు నీ సేవలో ఎట్టి ప్రతిఫలాపేక్షయును లేదు. నిన్నే నిత్యము నమస్కరింతును. నిన్నే స్మరింతును, నిన్నే కీర్తించెదను. నిన్నే పూజింతును. నిన్నే ధ్యానింతును.

 
 whatsnewContactSearch