home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

ఎందరున్న నేమి గోపి?


ఎందరున్న నేమి గోపి? - నాకు ప్రాణ ప్రాణ మీవె |  (పల్లవి)

1. ఎన్ని తారలున్న నేమి? - గగనతలము బిక్కుమనును |
పూర్ణ చంద్ర బింబ మనెడి - దీప మొకటి లేకయున్న |
ఎన్ని నదులు ఉన్న నేమి? - భిన్న వర్ణ రుచుల తోడ |
నీల జలధి నందు కలియు - నీల యమున లేకయున్న ||

2. ఎన్ని పూవులున్న నేమి? -కృష్ణ భ్రమర మెపుడు తిరుగు |
ఆ సుగంధ పద్మ మొకటి - సరసు నందు లేకయున్న |
ఎన్ని గ్రంధ శతములున్న - వాటి వలన నేమి ఫలము |
గోపి కృష్ణ ప్రణయ బంధ - భాగవతమె లేకయున్న |
రుక్కు గాని భామ గాని - అష్ట సతులు ఆపలేరు |
బృంద లోని నిన్నుఁ జూడ - జీవుడెగుర సిద్ధమయ్యె ||

 
 whatsnewContactSearch