home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

చదువురాని చందమామ


(దేవతలు ఋషులు గోపికను స్తుతించు భజన)

చదువురాని చందమామ ! వేద ఋషివి నీవె గోపి ! (పల్లవి)


1. చదువులన్ని చదివి చదివి - చదువు లోని  సారమెరిగి |
చదువులేని జన్మ నెత్తి - మార్గమైన గొల్లభామ |
హరినిఁ బట్ట విద్యలెన్నొ - నేర్చి విర్రవీగినాము |
ప్రేమ విద్యతోడ హరిని - పాదదాసుఁ జేసినావు ||

2. తపములెన్నో చేసినాము - స్వామి చూపుకూడ లేదు |
తపమనంగ ప్రేమయనుచు - తెలిపినావు ప్రణతులివియే |
యుగతపములఁ జేసినాము - స్వామి చూపుకూడ లేదు |
ఎంతదానివమ్మ నీవు - నీదు విరహ మందు వేగు ||

3. నెమలికన్ను వాడిపోయె - మురళి నూద మాడిపోయె |
చందనంబు రాలిపోయె - కనులు రెండు వాలిపోయె |
వేడి హెచ్చె నాడితగ్గె - దేహమంత కాలుచుండ |
తిలకమంత కారిపోయె - తులసిమాల తుంపులయ్యె |
శ్రావణమున కృష్ణ మేఘ - కరుణ వృష్టి రయముతోడ |
ఎన్ని అడ్డులున్న దాటి - జలధి శయనుఁ జేరవమ్మ ||

 
 whatsnewContactSearch