home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

భాగవతము రంకు కాదు


భాగవతము రంకు కాదు - ఙ్ఞానమదియె ఓరి శుంఠ ! |
గోపి వేశ్య యనిన మూఢ - దత్తుడెపుడు వేశ్య రతుడె || (పల్లవి)

1. వేదశాస్త్రమర్ధమైన - మాత్రమిచట పండితుండె |
కృష్ణకేళి దత్తలీల - భాగవతము నెరుగకున్న |
స్వామి కొరకు సర్వధర్మ - త్యాగమాచరింపవలయు |
సర్వధర్మత్యాగి సర్వ - పాపముక్తు డనును గీత || ("సర్వ ధర్మాన్" .. గీత)

2. త్రికరణార్పణంబు సంధ్య - చివరి శ్లోక సారమదియె  |
కృష్ణ దత్త గోపిమునియె - ఆచరించి చూపెనిచట || ("కాయేన వాచా" ..)

3. హరికి ప్రియమె పుణ్యమన్న - హరికి కోపకరమె అఘము |
ప్రకృతి రూప జీవులెల్ల - స్త్రీలె పురుషుడొకడె అతడు ||

 
 whatsnewContactSearch