
13 Jul 2002
                      
                      
                      
                      
 
                      
                      
నన్ను కూడా బ్రోచినావా నళిన దళ లోచనా (పల్లవి)
మానవాధమ పంక్తిలోనే అంటరాని వాడనయ్యా
మద్యపానము చేసి చేసి మత్తులోన మునిగినావు
మంచి చెడును వేరు చేయక నన్ను కూడా కాచినావు
కరుణకైనా హద్దులున్నవి, హద్దులన్నీ దాటినావు
నీ దయకు నేనే దృష్టాంతమన్న పారమే లేని దయా జలధివీవు ॥