home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

బ్రహ్మజ్ఞానీ బ్రాహ్మణో హి


బ్రహ్మజ్ఞానీ బ్రాహ్మణో హి ।
నేతా బ్రాహ్మణ ఏక దత్తః ॥ (పల్లవి)

పరబ్రహ్మమునకు సంబంధించిన అన్ని ఆధ్యాత్మిక విషయములను తెలిసికొని ఉండడమే గాక సమాజమునకు పరబ్రహ్మ విషయకమైన ఆధ్యాత్మిక జ్ఞానమును బోధించి అట్టి పరబ్రహ్మము వైపు నడిపించేవాడే బ్రాహ్మణుడు. ఏ జీవుడూ పరిపూర్ణముగా అటువంటి బ్రాహ్మణుడు కాలేడు కావున శ్రీదత్తుడే నిజమైన బ్రాహ్మణుడు.

{‘బ్రహ్మ నయతి ఇతి బ్రాహ్మణః’ అని బ్రాహ్మణ శబ్దమునకు నిర్వచనము. సమాజమునకు పరబ్రహ్మ విషయకమైన, వాస్తవికమైన ఆధ్యాత్మిక జ్ఞానమును బోధించి అట్టి పరబ్రహ్మము వైపు నడిపించేవాడే బ్రాహ్మణుడు.}

భగవాన్ గాయతి గుణ కర్మభిః ।
సృష్టో వర్ణో మయైవేతి ॥

జీవుల యొక్క సత్త్వ, రజస్తమోగుణములు, వాటి ప్రభావంచే చేయబడే కర్మల ఆధారంగా బ్రాహ్మణాది వర్ణ వ్యవస్థను సృష్టించానని శ్రీమద్భగవద్గీతలో (శ్రీమద్భగవద్గీత అనగా భగవంతునిచే గానం చేయబడినది అని అర్థము) కృష్ణ భగవానుడే స్వయంగా చెప్పాడు.
{‘చాతుర్వర్ణ్యం మయా సృష్టమ్, గుణ కర్మ విభాగశః’ – అని శ్రీమద్భగవద్గీత.}

జన్మని వర్ణే మనుష్య సృష్టే,
కర్తా నాఽహమితి చ సుగీతమ్ ॥

పుట్టుకతో కలిగే వివిధ వర్ణములను తను సృష్టించలేదని అటువంటి జన్మాధారిత వర్ణవ్యవస్థను మానవులే ఏర్పరుచుకున్నారు తప్ప తాను కానని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు.

{‘తస్య కర్తారమపి మాం’ – అనే శ్లోకపాదము ద్వారా గుణ, కర్మలననుసరించి కలిగే వర్ణవ్యవస్థను తనే సృష్టించానని, ‘విద్ధ్యకర్తారమవ్యయమ్’ – అనే శ్లోకపాదము ద్వారా రెండవదైన, మానవులు ఏర్పరుచుకున్న కులవ్యవస్థ భగవానుడి వర్ణవ్యవస్థ కంటె ఖచ్చితంగా భిన్నమైనదని పరమాత్మ తెలిపారు. లేకుంటే ఈ రెండు వ్యవస్థలకు పరస్పర విరోధం కలుగుతుంది కద. భగవంతుని వర్ణవ్యవస్థకు, కృత్రిమమైన రెండవ కులవ్యవస్థకు ప్రధాన భేదం ఏమంటే జీవులేర్పరుచుకున్న కులవ్యవస్థ పుట్టుకతోనే ఏర్పడుతోంది. ఇది భగవంతుని వర్ణవ్యవస్థకు పూర్తి విరుద్ధము.}

గుణ కర్మజన్మ గుణ కర్మాత్తమ్ ।
జన్మ తు నిరర్థకమితి హి సత్యమ్ ॥

పుట్టుకతో సంక్రమించే కులవ్యవస్థ కూడ గుణ, కర్మలననుసరించే ఏర్పడుతుందని, అట్టి గుణ-కర్మల అనుసారంగానే జీవుడు ఆయా కులాలలో పుడతాడు కావున ఈ కులవ్యవస్థ కూడ సరైనదే కదాయని కొందరు వాదిస్తారు. ఇది వెర్రితనముతో కూడిన వాదము. తర్కరహితంగా అలా వాదించడం వలన గుణ, కర్మల ఆధారంగా పుట్టుకతో వచ్చే కులవ్యవస్థకు సంబంధించి అనేకములైన వాద-ఉపవాదాలు పుడతాయి. ఉదాహరణకు :- నీ వాదం ప్రకారము పుట్టినవారికి అవే గుణకర్మలు ఉంటాయి కావున వారు కూడా మా వాదము క్రిందికే వస్తారు కదా. నీవు చెప్పినట్లు కులవ్యవస్థకు పుట్టుకే ఆధారమన్నట్లయితే, కులములయొక్క గుణ-కర్మలకు విరుద్ధంగా, కొన్ని కులములందు పుట్టిన కొందరు కులాతీతులైన జీవులను గూర్చి వివరించడం ఎన్నడూ సాధ్యం కాదు.

 
 whatsnewContactSearch