home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

దత్తాత్రేయ! కియన్ను మధు తే


[శ్రీ దత్తస్వామి వారిలో శ్రీదత్త పరమాత్మ శ్రీశైల పర్వతముపై ఐక్యం కావడానికి పూర్వము, స్వామివారి ఎదుట దత్తుడు తరచూ ప్రత్యక్షమై ఆధ్యాత్మిక జ్ఞానమును చర్చించేవారు. ఆయా సందర్భాలలో, ఆయా జ్ఞాన సంవాదములు ముగిసిన పిమ్మట దత్త భగవానుడు అదృశ్యమయేవారు. అలా దత్తుడు అదృశ్యమైన వెనువెంటనే, ప్రతిసారి, శ్రీ దత్తస్వామి వారు ఆశువుగా  తమ మనస్సులో ఒక గీతమును పాడుకొనేవారు.  అటువంటి అపూర్వమైన ఆ గీతము ఈరోజు భక్తులందరిపై వాత్సల్యముతో వెల్లడించబడుతోంది!]

దత్తాత్రేయ! దత్తాత్రేయ!
కియన్ను మధు తే నామ వచశ్చ! (పల్లవి)

ఓ దత్తాత్రేయ! తండ్రీ దత్తాత్రేయ! నీ నామమును ఉచ్చరిస్తున్నపుడు ఎంత మధురముగా ఉంటుంది! నీ వాక్కు కూడ వినడానికి ఎంత మధురముగా ఉంటుంది!

కోటి కోటి ఘట సుధా పానం ను!
కోటి కోటి మహతీ శ్రవణం ను!

నీ నామమును ఉచ్చరిస్తున్నపుడు, దివ్యమైన అమృతముతో నిండిన కోట్లకొలది ఘటములను సేవిస్తున్న అనుభూతి నాకు కలుగుతోంది కద! నీవు మాట్లాడుతుండగా, కోట్లకొలది మహతీ వీణలు (నారద మహర్షి యొక్క వీణ పేరు మహతి) ఒక్కసారిగా మీటగా వింటున్న అనుభూతి కలుగుతుంది కద!

కియన్ను రమ్యం తవ సౌందర్యమ్!
కోటి కోటి మదనానాం రూపమ్!

ఎంత ఆకర్షణీయమైనదో కద నీ సౌందర్యము! సుందరాకారుడైన మన్మథుని యొక్క అత్యద్భుతమైన రూపము కోట్లకొలదిగా  హెచ్చింపబడి నీ సుందరాకృతి దాల్చినదా అన్నట్లు నాకనిపిస్తుంది.

కియన్ను తే సౌరభ మామోహః!
కోటి కోటి కమలానాం గంధః!

నీ దివ్యమైన శరీరమునుండి వెలువడే ఆ సుగంధము ఎంత తీవ్రమైన మోహాన్ని కలిగిస్తుందో కద! కోట్లాదిగా తామరపువ్వులు తెచ్చి ఒకచోట రాశిపోస్తే అవి ఎంత సుగంధమును ఒక్కసారిగా వెదజల్లుతాయో అంత సుగంధమును నీ దివ్యశరీరము వెదజల్లుతోందని నాకనిపిస్తోంది.

 
 whatsnewContactSearch