home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

ఏకతో దత్త! గీతాసారః


ఏకతో దత్త! గీతాసారః,
ప్రేమోభయతో వాణిజ్యం హి ॥ (పల్లవి)

ఓ దత్తప్రభో! అవతలి వారినుండి ఏమీ ఆశించకుండ, తమ వైపు నుండి ప్రదర్శించే ప్రేమయే నిజమైన ప్రేమయని గీతాసారము. అవతలివారి నుండి కూడ ప్రేమను ఆశిస్తే అది ప్రేమ కాదు, వాణిజ్యమే అవుతుంది. అటువంటి వాణిజ్య రూపమైన ప్రేమ ‘వైశ్యభక్తి’ అని పిలువబడుతుంది.

ఉన్మత్తానుగ ఏకోపమా,
రాజకీయ చలచిత్ర నటస్య ॥

తన ఆరాధ్య చలనచిత్ర కథా నాయకుని పట్లనో, తన ఆరాధ్య రాజకీయ నాయకుని పట్లనో ఒక పిచ్చి అభిమాని చూపించే ప్రేమయే, ఒకవైపు నుండి మాత్రమే ప్రదర్శించే నిజమైన ప్రేమకు తులనాత్మకమైన ఉదాహరణము. ఈ సమస్త ప్రపంచములో అటువంటి తులనాత్మకమైన ఉదాహరణము ఇది ఒకటే ఉన్నది.

పశ్యేఽపశ్యే ధనక్రియాభ్యామ్,
కేవల మాకర్షణ మన్యతః ॥

అవతలి వైపువారు గమనించినా, గమనించకపోయినా, నిజమైన ప్రేమికుడు సేవ-త్యాగములతో కూడిన ఆచరణాత్మకమైన ప్రేమతో వారిని ప్రేమిస్తాడు. అవతలి వైపునుండి ఏమీ ఆశించకుండ, వారినుండి ఏర్పడే ఆకర్షణ వలన మాత్రమే నిజమైన ప్రేమ కలుగుతుంది.
{సేవ లేక సంన్యాసము ‘కర్మ సంన్యాసము’ అని, త్యాగము ‘కర్మఫల త్యాగము’ అని అనబడతాయి. ఇదే నిష్కామ కర్మయోగముగా చెప్పబడుతుంది. ఈ ఆచరణాత్మకమైన భక్తి ద్వారానే భగవంతుని పట్ల మనకున్న నిజమైన ప్రేమను వ్యక్తీకరించడం సాధ్యమవుతుంది.}

ప్రాణత్యాగః క్రియతే మృతౌ,
ధన కలహే సతి కుటుంబినాం తు ॥

తను మెచ్చిన చలనచిత్ర కథా నాయకుడో, రాజకీయ నాయకుడో మృతి చెందగా ఆ దుఃఖంతో, ఒక పిచ్చి అభిమాని, తన ప్రాణాన్ని కూడ తీసుకునే హడావిడిలో ఉంటే, ఆ మృతి చెందినవాని కుటుంబ సభ్యులు మాత్రం వాడికి అంత్యక్రియలు చేసి స్మశానము నుండి తిరిగి వస్తూనే, మృతి చెందినవాని డబ్బులో తమ తమ వాటాల కోసం గొడవపడే హడావిడిలో ఉంటారు!

 
 whatsnewContactSearch