home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

కాషాయ పట! జ్ఞాన తేజాః


(Sung by Smt. Devi)

కాషాయ పట! జ్ఞాన తేజాః ।
ఉద్యదాదిత్య!  తమోఽన్త దత్త!  ॥ (పల్లవి)

కాషాయ వస్త్రములను ధరించి ఆధ్యాత్మిక జ్ఞానమును బోధిస్తున్న ఓ దత్త పరమాత్మా! నీవు ఎర్రగా ఉదయించి అద్భుతమైన తేజస్సుతో ప్రకాశించే సూర్యునిలా కనిపిస్తున్నావు. అంధకారము లేక అజ్ఞానరూపమైన తమస్సును సంహరించేవాడవు నీవే.

మాతా జనకో భార్యా పుత్రా ।
అజ్ఞా గురవో నానా దివ్యాః  ॥

తల్లి, తండ్రి, భార్య లేక భర్త, పిల్లలు, అజ్ఞానులైన గురువులు మరియు నానా రకములైన దివ్య రూపములు అనేవి జీవుని కట్టిపడవేసే రకరకాల బంధములు.

ఒకే భగవంతుని యొక్క వివిధములైన దివ్య రూపములు వివిధములైన మతములను, అనేకములైన ఉపమతములను ప్రపంచములో పుట్టించినవి. కాని, అజ్ఞానముతో కూడిన జీవుడు వివిధములైన దివ్యరూపములను చూసి ఆ రూపములన్నీ వేరు వేరుగా అనుకొని పొరపాటుబడతాడు. పర్యవసానంగా, ఆ జీవుడు తన మతమునకు చెందని భగవంతుని దివ్యరూపములను ద్వేషించి, వేరే మతములకు చెందిన భక్తులతో గొడవలకు దిగడం మొదలుపెడతాడు. కాబట్టి, భగవంతుని అనేక రూపాల పట్ల సరైన అవగాహన లేకపోవడమనే కారణం చేత, భగవంతుని ఒక ప్రత్యేకమైన దివ్య రూపమందు ఆకర్షణ ఉండడం, అలానే వేరే మతముల దివ్య రూపాలయందు ద్వేషము ఉండడం (ఆజ్ఞా చక్రము) ఒక సుడిగుండమే (చక్రము). అది జీవుని బంధించి అదృష్టకారణంగా కలిగే భగవంతుని కలయికను (యోగము) పొందకుండా నిరోధిస్తుంది.

చక్రం పద్మం బన్ధ భ్రమదమ్ ।
మాయా వక్రం సర్ప గమనమ్ ॥

ప్రపంచమనే సముద్రములో ఈ ఆరు బంధములు ఈతగాడిని ఆకర్షించి తరువాత ముంచివేసే సుడులు తిరిగే సుడిగుండములుగా పోలిక చెప్పినారు. తమ సుగంధముతో నల్ల తుమ్మెదను ఆకర్షించే పద్మములుగా కూడ ఈ బంధములను పోల్చినారు. ఈ బంధములనుండి జీవుడు (కుండలిని) తప్పించుకొని వెళ్లగలిగిన ఏకైక మార్గమేమంటే, సర్పగమనము వంటి వక్రమార్గమును అనుసరించుటయే. అంటే, జీవుడు తనను తాను కాపాడుకొనుటకు మోసము చేసి ఈ బంధములనుండి తప్పించుకొనుటకు ఒక భ్రాంతి కల్పన చేసుకొనగలగాలి.

ఒకవేళ కుండలిని-సర్పము తను వెళ్ళే దారిలో వేగంగా తిరిగే చక్రములవంటి వరుసగానున్న బంధములను నేరుగా దాటుటకు ప్రయత్నం చేస్తే ఆ చక్రములలో పడి ముక్కలు ముక్కలైతుంది. అలాగే, ఆధ్యాత్మిక సాధనలోనున్న జీవుడు తన మార్గసాధనలో భాగంగా సంసార బంధములతో (బంధువులు వగైరా) ముక్కుసూటిగా వ్యవహరిస్తే ఆ బంధములు (బంధువులు) ఆ సాధకుని వ్యతిరేకిస్తాయి లేక ఆ సాధకుడే చివరకు వాటిని (బంధువులను) వ్యతిరేకిస్తాడు. ఎటు చూసినా కాని ఆ పరిస్థితి రెండువైపులా తీవ్రమైన ఉద్వేగాన్ని కలిగిస్తుంది. దాని బదులుగా, జీవుని బంధములు (బంధువులు) జీవుని ఆధ్యాత్మికతను వ్యతిరేకించి సహకరించనపుడు సాధకుడైన ఆ జీవుడు మోసంతో (వక్రమైన సర్పగమనం లాగ) తన లక్ష్యము సాధించుకోగలగాలి. జీవుడు తన బంధములను (బంధువులను) ప్రేమిస్తున్నట్లుగా బయట నటిస్తూ, అది వాటిని (వారిని) శాంతపరస్తుంది కాబట్టి రహస్యంగా తన ఆధ్యాత్మిక మార్గములో సాధనకు ముందుకెళ్ళాలి. వంచన మరియు రహస్యములతో కూడిన అట్టి మోసపూరిత పద్ధతిని వంకరగా పోవు సర్పగతిలాగ జీవుడు (కుండలిని) అనుసరించాలి. ఏదో ధర్మవిరుద్ధమైన ప్రాపంచిక బంధము కోసం కాకుండ, భగవత్ప్రాప్తి కోసం చేసే ప్రయత్నం అవడం వలన ఆ విధంగా మోసం చేయడం పాపం కాదు.

ఉపమాన భ్రమ సచ్చిదుపమా ।
యోగజ్ఞస్త్వం యోగి రాజ! ॥

ముందు చెప్పిన ఈ చక్రములు, పద్మములు, కుండలిని, వేయి దళములు కలిగిన పద్మము మొదలైన ఉపమానములను నిజమైన అర్థములో తీసుకొనరాదు. అలాగే, చైతన్యము సృష్టిలో అత్యుత్తమమైన పదార్థముగా భగవంతునితో పోల్చి చెప్పారు. ఇక్కడ కూడ ఈ పోలికను యథార్థముగా చూడరాదు. ఓ యోగిరాజ, ఆధ్యాత్మిక సాధకులకు రాజాధిరాజ! నీవొక్కడవే “యోగ శబ్దానికి నిజమైన అర్థము తెలిసినవాడవు.

యోగమంటే సమకాలీన నరావతారముతో మనుష్యునికి అదృష్టముతో కలిగే కలయిక. ఇంకోలా చూస్తే, యోగమంటే అదృష్టముతో మూల తేజోరూపము ఒక భగవంతుని తేజోవతారముతో కలయిక పొందడము. యోగశబ్దమునకు సరైన అర్థమును తెలిసిన ఒకే ఒక దత్త భగవానుని ద్వారా యోగ శబ్దమునకు సరైన అర్థము లోకములో వెల్లడించబడినది.

 
 whatsnewContactSearch