home
Shri Datta Swami

Bhakti Ganga (Devotional Songs) — English  Telugu  Hindi

శ్రీ దత్తన్నా - గురు దత్తన్నా


శ్రీ దత్తన్నా - గురు దత్తన్నా - ప్రభు దత్తన్నా - నా దత్తన్నా   (పల్లవి)


సృష్టిస్థితిలయ - కారకులుండగ - త్రిమూర్తులొక్కటే - బ్రహ్మమెట్లగును |
అని తపముచేయు - అత్రి మహర్షికి - త్రిమూర్తి ముఖముల - కనిపించినావు ||
సృష్టి,స్థితి,లయ - కారణమొక్కటే - వేదము చెప్పిన - పరమబ్రహ్మము |
త్రిమూర్తి తత్త్వం - దత్తాత్రేయమె - పరబ్రహ్మమన - వేదసిద్ధమిది. ||
వేషాలు వేరు - నామాలు వేరు - పరబ్రహ్మమను - వ్యక్తి ఒక్కడగు |
నానాపాత్రల - ధరించునటుడవు - రమించువాడవు - నీవేనన్నా ||
బ్రహ్మన్న నీవే - హరియన్న నీవే - రుద్రన్న నీవే - భైరవన్నవును |
రామన్న నీవే - కృష్ణన్న నీవే - గణపన్న నీవే - వీరన్న నీవే ||
వెంకన్న నీవే - మల్లన్న నీవే - నరసన్న నీవే - అయ్యప్పన్నవు |
హనుమన్న నీవే - గరుడన్న నీవే - శేషన్న నీవే - సుబ్బన్న నీవే ||
వాణమ్మ నీవే - లక్ష్మమ్మ నీవే - గౌరమ్మ నీవే - దుర్గమ్మ నీవే |
అనఘమ్మ నీవే - లలితమ్మ నీవే - భ్రమరమ్మ నీవే - పద్మమ్మ నీవే ||
రుక్కమ్మ నీవే - సత్యమ్మ నీవే - రాధమ్మ నీవే - సీతమ్మ నీవే |
అరుంధతమ్మవు - అనసూయమ్మవు - కాళెమ్మ నీవే - సువర్చలమ్మవు ||
సర్వదేవతలు - సర్వగ్రహములు - సర్వావతార - సర్వసిధ్ధులును |
నీ రూపములగు - నీ వేషములే - నీ గుణములైన - నీ భావములే ||
ఏ దేవరూప  - మైనను వేషమె - వేషధారియగు - దత్తుడొక్కడే |
ఏ వేషమైన - మాలలు వేసిన - వేషధారికే - ప్రీతిని చేయును ||
నదీనదములెటు - కడలిని చేరునొ - నానాదేవత - భజనలన్నియును |
నిన్నే చేరగ - ఆనందితువు - ప్రత్యుత్తరమును – ఇత్తువు నీవే ||
సకల చరాచరా - జగత్తు  భార్యయే - సర్వజీవులును - స్త్రీ రూపములే |
పురుషడ వీవే - వేదము పల్కును - సర్వ భర్తవై - ఆడుచున్నావు. ||

 
 whatsnewContactSearch